ఖుషి సినిమాకు రెండు సెంటిమెంట్
మహానటి మూవీ తర్వాత విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న ప్రేమ కథా చిత్రం ఖుషి. మహానటిలో వీరిద్దరూ కలిసి జంటగా కనిపించేది కాసేపే అయినా ఇప్పుడు వీరిద్దరూ మెయిన్ లీడ్‌గా ఖుషి సినిమా రాబోతుంది. అయితే ఈ సినిమాకు ఓ నెంబర్ సెంటిమెంట్ పట్టుకుంది.
అవును ఖుషి సినిమా రెండు అనే నెంబర్ చుట్టూ తిరుగుతుంది. మహానటి తర్వాత విజయ్, సమంత కాంబోలో వస్తున్న రెండో సినిమా ఇది. శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత చేస్తున్న రెండో సినిమా కూడా ఇదే. ఇక డియర్ కామ్రేడ్ తర్వాత మైత్రీ బ్యానర్ లో విజయ్ చేస్తున్న సినిమా అవడంతో అక్కడ కూడా రెండు నెంబర్ ఉంది. ఇలా మూడు విషయాల్లో ఖుషి సినిమా రెండు నెంబర్ చుట్టూ తిరుగుతుంది.
ఇది కాకుండా ఖుషి టైటిల్‌తో పవన్ బ్లాక్ బస్టర్ సెంటిమెంట్ ఎలాగో ఉంది. దానికి తోడు ఈ రెండు నెంబర్ సెంటిమెంట్ కూడా తోడైంది. విజయ్- మైత్రీ సెంటిమెంట్ ను పక్కన పెడితే మిగిలిన రెండు సెంటిమెంట్లు వర్కవుట్ అయితే ఖుషి పెద్ద హిట్ అన్నట్లే. దానికి తోడు ఎలాగూ సెప్టెంబర్‌లో పెద్దగా రిలీజ్ లేని టైమ్‌లో ఖుషిని రిలీజ్ చేస్తున్నారు. సినిమాకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా మంచి వసూళ్లు తెచ్చుకోవడం ఖాయంగానే కనిపిస్తుంది.













