VIjay-Rashmika: విజయ్, రష్మిక ఒకే బాటలో
విజయ్ దేవరకొండ(vijay devarakonda), రష్మిక మందన్నా(Rashmika Mandanna) కొన్నాళ్ల కిందట చాలా సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. కొన్నేళ్లుగా రిలేషన్ లో ఉన్న వీరిద్దరూ వరుస సినిమాలతో ఎవరి కెరీర్లో వారు బిజీగా ఉన్నారు. రష్మిక తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస పెట్టి సినిమాలు చేస్తూ సూపర్ హిట్లు అందుకుంటుంటే విజయ్ మాత్రం ఓ సాలిడ్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ ఇద్దరూ నటిస్తున్న సినిమాలు ఒక్కసారిగా అందరికీ హాట్ టాపిక్ గా మారాయి. దానికి కారణాలు లేకపోలేదు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం రవి కిరణ్ కోలా(Ravi Kiran Kola) దర్శకత్వంలో రౌడీ జనార్ధన్(Rowdy Janardhan) అనే సినిమా చేస్తుండగా, రీసెంట్ గా దానికి సంబంధించిన టైటిల్ గ్లింప్స్ రిలీజైంది. ఆ గ్లింప్స్ లో విజయ్ కత్తి పట్టుకుని రక్తపాతం సృష్టిస్తూ బ్లడ్ బాత్ చేస్తూ కనిపించాడు.
ఇప్పుడు విజయ్ బాటలోనే రష్మిక కూడా అలానే బ్లడ్ బాత్ చేస్తూ తనలోని మాస్ యాంగిల్ ను బయటకు తీసింది. రష్మిక నటిస్తున్న మైసా(Mysaa) మూవీ నుంచి రీసెంట్ గా గ్లింప్స్ రిలీజవగా అందులో రష్మిక రక్తంతో తడిసిన గన్ ను పట్టుకుని తనపైకి వచ్చేవాళ్లను చంపుతున్నట్టు కనిపించింది. ఇది చూసి రష్మిక, విజయ్ ప్రస్తుతం ఒకేదారిలో వెళ్తున్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.






