అజిత్ సరసన విద్యాబాలన్
అజిత్ త్వరలో పింక్ రీమేక్ లో నటిస్తున్నారు. ఖాకీ ఫేం హెచ్ వినోథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం అజిత్‌కి 59వ చిత్రం. హిందీలో ఘన విజయం సాధించిన పింక్ సినిమాలో తమిళ నేటివిటీకి అనుగణంగా పలు మార్పులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. హిందీలో అమితాబ్‌బచ్చన్, తాప్సీ ప్రధాన పాత్రల్లో పింక్ తెరకెక్కింది. కాని తమిళంలో అజిత్‌కి సరసన ఓ భామని నటింపజేయాలని చిత్ర యూనిట్ భావిస్తుండగా, విద్యాబాలన్‌ని ఎంపిక చేసినట్టు సమాచారం. ఈ చిత్రం విద్యా బాలన్‌కి తమిళంలో డెబ్యూ కానుంది. ఇక తాప్సీ పాత్రలో శ్రద్ధ శ్రీనాథ్‌ని తీసుకున్నారు. జర్నలిస్టు రంగరాజ్ పాండే కూడా ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. యువన్ శంకర్‌రాజా సంగీతం సమకూర్చుతున్నారు. నీరవ్‌షా సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించనున్నారు. అతి త్వరలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళనుంది.













