ప్రధాని కోసం ముఖ్యమంత్రిని త్యాగం చేసింది
ఒకరు దివంగత ప్రధాని ఇందిరాగాంధీ, ఇంకొకరు దివంగత ముఖ్యమంత్రి జయలలిత. ఈ ఇద్దరి బయోపిక్‌లో టైటిల్ రోల్స్ నటించే అవకాశాలు ఒకేసారి వరించాయి విద్యాబాలన్‌ను. ఈ రెండిట్లో ఏది ఎంపిక చేసుకోవాలనే దానిపై ఆమె చాలా తర్జనభర్జన పడే ఉంటారు. చివరికి ప్రధాని కోసం ముఖ్యమంత్రిని త్యాగం చేశారు. దాంతో జయలలితగా నటించే అవకాశం కంగనాను వరించింది. ఇందిరా మెప్పించేందుకు అప్పుడే కసరత్తులు చేస్తోంది బాలన్. మరి ఇందిర బయోపిక్‌లో నటించే అవకాశం సొంతం చేసుకోవడం కోసం జయలలిత బయోపిక్‌ను మిస్ చేసుకునే పరిస్థితి విద్యాబాలన్‌కి వస్తుందా అంటే అప్పుడే ఎలా చెప్పగలం?













