Vidya Balan: ఆ సినిమా ఆగిపోవడంతో ఐరెన్ లెగ్ అనేశారు

పలు భాషల్లో నటించి అన్ని చోట్లా నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ విద్యా బాలన్(Vidya balan). ది డర్టీ పిక్చర్(the Dirty Picture) సినిమా విద్యాకు మంచి పేరును తెచ్చిపెట్టింది. రీసెంట్ గా ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్న విద్యా బాలన్ తన కెరీర్ మొదట్లో ఎదుర్కొన్న బ్యాడ్ ఎక్స్‌పీరియెన్స్‌ల గురించి మాట్లాడారు. మలయాళ మోహన్ లాల్(Mohanlal) తో కలిసి ఆమె చక్రం(Chakram) అనే సినిమాకు సైన్ చేశానని చెప్పారు.
కొన్నాళ్ల పాటూ షూటింగ్ జరిగాక చక్రం సినిమా షూటింగ్ ఆగిపోయింది. దీంతో ఆ సినిమా ఆగిపోవడానికి కారణం విద్యాబాలనే అని అందరూ తనను ఐరెన్ లెగ్ అనేశారు. దీంతో రాత్రికి రాత్రే విద్యాబాలన్ సైన్ చేసిన 9 సౌత్ సినిమాల నుంచి ఆమెను తొలగించారు. అయితే అసలు ఆ ప్రాజెక్టు ఆగిపోవడానికీ తనకీ మధ్య ఎలాంటి సంబంధం లేదని విద్యాబాలన్ ఆ ఇంటర్వ్యూలో తెలిపారు.
డైరెక్టర్‌కీ, మోహన్ లాల్ కీ మధ్య మనస్పర్థలు రావడంతోనే చక్రం సినిమా ఆగిపోయిందని, కానీ దాని ప్రభావం తన కెరీర్ పై పడిందని, చేయాల్సిన సినిమాలు చేజారినా తానెప్పడూ వెనుకడుగేయలేదని, తనపై తనకు ఉన్న నమ్మకమే ఇవాళ తనను ఈ స్థాయికి చేర్చిందని ఆమె తెలిపారు. ఎన్నో ఎదురుదెబ్బలు తిన్న తర్వాతే తనకు ఈ స్థాయి వచ్చిందని ఆమె చెప్తున్నారు.