Vetrimaran: ధనుష్ తో గొడవలపై వెట్రిమారన్ క్లారిటీ

గత కొన్నాళ్లుగా కోలీవుడ్ హీరో ధనుష్(Dhanush), డైరెక్టర్ వెట్రిమారన్(Vetrimaran) మధ్య విభేదాలున్నాయని వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలపై తాజాగా వెట్రిమారన్ స్పందించాడు. తన నెక్ట్స్ సినిమాను అనౌన్స్ చేస్తూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై వెట్రిమారన్ క్లారిటీ ఇచ్చాడు. నెట్టింట జరుగుతున్న ప్రచారం తనను ఎంతగానో బాధించిందని అన్నాడు.
తన తర్వాతి సినిమాను అనౌన్స్ చేస్తూ వెట్రిమారన్ ఈ విషయంపై మాట్లాడారు. సూర్య(Suriy)తో చేయాల్సిన వాడి వాసల్(Vaadi vasal) మూవీ కొన్ని కారణాల వల్ల ఆలస్యమవుతుందని, అందుకే ఈ గ్యాప్ లో తాను శింబు(Simbhu)ను కలి ఓ కథ చెప్పగా, ఆ కథకు శింబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిపారు. ఈ మూవీ కూడా వడ చెన్నై బ్యాక్ డ్రాప్ లోనే ఉంటుందని, అలా అని ఈ సినిమా వడ చెన్నై(Vada Chennai)కు సీక్వెల్ కాదని వెట్రిమారన్ చెప్పారు.
వడ చెన్నైకు సంబంధించిన అన్నీ రైట్స్ ధనుష్(Dhanush) దగ్గరే ఉన్నాయని, ఈ విషయంపై తాను ధనుష్ తో చర్చించానని, శింబుతో సినిమా చేస్తున్నానని, ఆయన ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా, ఒక్క రూపాయి కూడా అడగకుండా ఎన్ఓసీ(NOC) ఇస్తానని హామీ ఇచ్చారని, కానీ ఈ విషయాలేవీ తెలియకుండా అందరూ తమ మధ్య గొడవలున్నాయని ప్రచారం చేస్తున్నారని, రీసెంట్ గా తాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా ధనుషే ఆదుకున్నారని వెట్రిమారన్ క్లారిటీ ఇచ్చాడు.