మూడోసారి బాలయ్య సరసన హీరోయిన్గా స్నేహ!
ఒకప్పుడు హీరోయిన్గా ఫ్యామిలీ ఆడియన్స్ అందర్నీఆకట్టుకొని తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది స్నేహ. తొలివలపు సినిమాతో తెలుగులో హీరోయిన్గా పరిచయమైన స్నేహ ఆ తర్వాత దాదాపు అందరు హీరోల సరసన హీరోయిన్గా నటించింది. 2012లో తమిళ నటుడు ప్రసన్నతో వివాహం తర్వాత హీరోయిన్గా ఏ సినిమాలోనూ నటించలేదు. సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు పోషిస్తోంది. వివాహం తర్వాత ఆమె చేసిన పాతిక సినిమాల్లోనూ కీలక పాత్రలు పోషించింది. ఇప్పుడు మరో విభిన్నమైన పాత్రలో కనిపించబోతోంది స్నేహ. నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో స్నేహ ఓ ముఖ్యపాత్ర పోషించనుంది. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయిన విషయం తెలిసిందే. షూటింగులకు అనుమతి ఉన్నప్పటికీ నటీనటులు, సాంకేతిక నిపుణులు కరోనాకు భయపడి షూటింగ్ చేయడానికి ఇష్టపడడం లేదు. మామూలు పరిస్థితి నెలకొన్న తర్వాత ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది.
ఈ సినిమాలో బాలకృష్ణ రెండు పాత్రలు పోషిస్తున్నాడు. ఒక పాత్రకు జోడీగా స్నేహ నటిస్తుందని తెలుస్తోంది. ఇంతకుముందు బాలకృష్ణ సరసన మహారథి, పాండురంగడు చిత్రాల్లో నటించిన స్నేహ మూడోసారి బాలయ్యతో నటిస్తోంది. ఇక ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్గా ఓ కొత్త అమ్మాయిని పరిచయం చేయబోతున్నారు. బిబి3 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాని మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. థమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.













