మరో రీమేక్‌లో వెంకీ?
మోహన్ లాల్ నటించిన నేరు మూవీ రీసెంట్ గా రిలీజై ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. సలార్, డంకీ లాంటి మూవీలు పోటీలో ఉన్నప్పటికీ, సినిమాపై నమ్మకంతో అదే టైమ్ లో రిలీజ్ చేశారు. కోర్ట్ డ్రామా గా తెరకెక్కిన ఈ సినిమా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది.
జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు కలెక్షన్స్ కూడా బాగానే వస్తున్నాయి. ఇప్పటికీ ఆయన దృశ్యంతో క్రియేట్ చేసిన రికార్డులు కేరళలో భద్రంగా ఉన్నాయి. దృశ్యం2 తెలుగు రీమేక్ నుంచి జీతూ జోసెఫ్ కు వెంకీతో మంచి బాండింగ్ ఉంది. ఆ చొరవతోనే నేరు మూవీ వెంకటేష్ కు బాగా సెట్ అవుతుందనే నమ్మకంతో జీతూ వెంకీకి ఈ మూవీ చూడమని రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం సైంధవ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న వెంకీ, తన టీమ్ కు నేరు మూవీ గురించి ఆరా తీయమని చెప్పినట్లు సమాచారం. ఒకవేళ నేరు మూవీ వెంకీకి నచ్చితే మాత్రం ఈ సినిమా రీమేక్ సెట్స్ పైకి వెళ్లడం ఖాయం. మానభంగానికి గురైన చూపు లేని అమ్మాయి కేసులో దోషులను పట్టించే లాయర్ గురించి ఈ సినిమా నడవనుంది. వెంకీ ఈ రీమేక్ చేస్తే తెలుగు ఆడియన్స్ కు మరింత చేరువ అవుతాడనంలో ఎలాంటి డౌట్ లేదు.













