Suriya: వెంకీ సినిమాలో సూర్య రోల్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) ఈ మధ్య ఏ సినిమా చేసినా పెద్దగా రావడం లేదు. వరుస ఫ్లాపులు సూర్యను ఇబ్బంది పెడుతున్నాయి. రీసెంట్ గా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తీసిన రెట్రో(Retro) సినిమా ఎన్నో అంచనాలతో వచ్చి డిజాస్టర్ అయింది. ఇదిలా ఉంటే సూర్య తన తర్వాతి సినిమాను తెలుగులో చేయనున్న సంగతి తెలిసిందే. తొలి ప్రేమ(Tholi Prema), సార్(Sir), లక్కీ భాస్కర్(Lucky Baskhar) ఫేమ్ వెంకీ అట్లూరి(Venky Atluri) దర్శకత్వంలో సూర్య సినిమా చేస్తున్నాడు.
సూర్య కోసం వెంకీ చాలా స్ట్రాంగ్ స్టోరీ రాశాడని ఆల్రెడీ వార్తలు కూడా వినిపించాయి. రీసెంట్ గానే పూజా కార్యక్రమాలను జరుపుకున్న ఈ సినిమాపై సూర్య ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా గురించి ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వినిపిస్తోంది. సూర్య- వెంకీ అట్లూరి కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో సూర్య డ్యూయల్ రోల్ చేయబోతున్నాడట.
అంతేకాదు, ఆ రెండు పాత్రల్లో ఒక క్యారెక్టర్ నెగిటివ్ కాగా మరో క్యారెక్టర్ పాజిటివ్ క్యారెక్టర్ అని రూమర్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ముందు భాగ్యశ్రీ బోర్సే(Bhagya Sri Borse)ను హీరోయిన్ గా అనుకున్నారు కానీ తర్వాత ఆ ప్లేస్ లోకి సడెన్ గా మమిత బైజు(Mamitha Biju) వచ్చింది. ఆల్రెడీ ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ ను వెంకీతో కలిసి జీవీ ప్రకాష్(GV Prakash) మొదలుపెట్టాడని సమాచారం. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్(Sithara Entertainments) బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ(Suryadevara Nagavamsi) భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.