Venky Atluri: లక్కీ భాస్కర్ కు సీక్వెల్ ఉంటుంది

హీరో నుంచి రైటర్ గా, రైటర్ నుంచి డైరెక్టర్ గా మారిన వెంకీ అట్లూరి(Venky Atluri) తొలి ప్రేమ(Tholi Prema) సినిమాతో ఇండస్ట్రీకి డైరెక్టర్ గా పరిచయమయ్యాడు. మొదటి సినిమాతోనే మంచి హిట్ ను అందుకున్న వెంకీ అట్లూరి ఆ సినిమాతో తనలో మ్యాటర్ ఉందనిపించుకున్నాడు. ఆ తర్వాత మిస్టర్ మజ్ను(Mr. majnu), రంగ్‌దే(Rangde) సినిమాలు చేసినప్పటికీ అవి యావరేజ్ ఫలితాన్నే ఇచ్చాయి.
కానీ ధనుష్(dhanush) హీరోగా చేసిన సార్(Sir) సినిమా మాత్రం వెంకీకి బ్లాక్ బస్టర్ ను అందించింది. సార్ సినిమా తర్వాత మలయాళ హీరో దుల్కర్ సల్మాన్(Dulquer salman) తో లక్కీ భాస్కర్(Lucky Baskhar) సినిమాను చేశాడు వెంకీ అట్లూరి. 2024లో వచ్చిన లక్కీ భాస్కర్ సినిమా పాజిటివ్ టాక్ ను తెచ్చుకోవడమే కాకుండా మంచి కలెక్షన్లను కూడా అందుకుంది. బొంబాయిలో ఉండే ఓ సాధారణ బ్యాంక్ క్యాషియర్ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతూ ఉంటుంది.
ఈ సినిమాలోని కథ, స్క్రీన్ ప్లే ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకోగా, రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ వెంకీ అట్లూరి లక్కీ భాస్కర్ కు సీక్వెల్ ఉంటుదని వెల్లడించాడు. ఆల్రెడీ తాను ఆ స్క్రిప్ట్ గురించి ఆలోచిస్తున్నట్టు కూడా వెంకీ తెలిపాడు. అయితే ధనుష్ తో చేసిన సార్ మూవీకి మాత్రం ఎలాంటి సీక్వెల్ లేదని వెంకీ చెప్పాడు. ప్రస్తుతం సూర్య(Suriya)తో సినిమా చేస్తున్న వెంకీ అట్లూరి ఆ సినిమా పూర్తయ్యాక లక్కీ భాస్కర్2(lucky baskhar2) చేసే అవకాశాలున్నాయి.