సోనూసూద్ ను కలిసిన వికారాబాద్ వాసి

కరోనా సమయంలో వేల మందికి సహాయం చేస్తున్న సినీనటుడు సోనూసూద్‍ను కలిసేందుకు వికారాబాద్ జిల్లా దోమ మండలం దోర్నాల్‍పల్లికి చెందిన వెంకటేశ్ కాలినడక ముంబై వెళ్లాడు. ఈ నెల 2న కాలినడక ముంబైకి బయలుదేరగా. విషయం తెలిసిన సోనూసూద్ అతడికోసం షోలాపూర్‍వరకు కారు పంపించారు. వెంకటేశ్‍ను ఇంటికి ఆహ్వానించి, మూడు గంటలు గడిపారు. కుటుంబ పరిస్థితిని తెలుసుకుని, జీవనానికి బర్రెలు కొనిస్తానని హమీ ఇచ్చారు. వెంకటేశ్ కోసం ఫ్లైట్ టికెట్ బుక్‍చేసి విమానంలో హైదరాబాద్ పంపించారు.