Venkatesh: వెంకీ స్పీడును తట్టుకోవడం కష్టమే.. ఏడాదిలో నాలుగు సినిమాల

ఈ ఏడాది సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki vasthunnam) సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించి ఆ సినిమాతో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ ను అందుకున్న విక్టరీ వెంకటేష్ తాజాగా రానా నాయుడు2(rana naidu2) తో ఆడియన్స్ ను అలరించాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు వెంకీ(Venky) యంగ్ హీరోలకు పోటీగా సినిమాలను లైన్ లో పెట్టి ఒక సంవత్సర కాలంలో ఏకంగా 4 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు.
వాటిలో భాగంగా ముందుగా వెంకీ, మెగా157(mega157)లో క్యామియో చేస్తున్నాడు. చిరూ(chiru)- అనిల్ రావిపూడి(anil ravipudi) కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాలో వెంకీ కీలక పాత్ర చేయనుండగా, ఆ సినిమా 2026 సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఆ తర్వాత త్రివిక్రమ్(trivikram) దర్శకత్వంలో వెంకటేష్ చేయనున్న సినిమా చేయనున్నాడు. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఆ సినిమా 2026 సమ్మర్ లో రిలీజ్ కానున్నట్టు తెలుస్తోంది.
ఆ తర్వాత వెంకీ జీతూ జోసెఫ్(jeethu joseph) దర్శకత్వంలో చేయబోయే దృశ్యం3(Drishya3) రానుంది. ఇప్పటికే దృశ్యం(drishyam), దృశ్యం2(Drishya2) సినిమాలతో ఆడియన్స్ ను థ్రిల్ చేసిన వెంకీ, ఈసారి దృశ్యం3లో ప్రేక్షకులను అలరించడానికి అక్టోబర్ లో రానున్నట్టు తెలుస్తోంది. దృశ్యం3 తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో మళ్లీ సంక్రాంతికి వస్తున్నాం(Malli Sankranthiki Vasthunnam) సినిమాను చేసి ఆ సినిమాను 2027 సంక్రాంతికి రిలీజ్ చేయాలని చూస్తున్నాడు వెంకీ. మొత్తానికి 365 రోజుల్లో వెంకీ నుంచి నాలుగు సినిమాలు రాబోతున్నాయి. చూస్తుంటే వెంకీ స్పీడును తట్టుకోవడం మిగిలిన హీరోలకు కష్టంగానే ఉంది.