Trivikram: త్రివిక్రమ్ ముందు భారీ సవాల్
సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunnam) సినిమాతో భారీ హిట్ అందుకున్న విక్టరీ వెంకటేష్(Venkatesh) తన తర్వాతి సినిమాను త్రివిక్రమ్(Trivikram)తో చేయనున్నాడని వార్తలొస్తున్నాయి. ఆల్మోస్ట్ ఈ ప్రాజెక్టు కన్ఫర్మ్ అయిందని సమాచారం. బన్నీ(Bunny)ఎలాగూ అట్లీ(Atlee) మూవీతో బిజీగా ఉన్నాడు కాబట్టి ఆ సినిమాను బన్నీ కంప్లీట్ చేసి ఫ్రీ అయ్యే లోపు త్రివిక్రమ్ కూడా వెంకీ(Venky) మూవీని పూర్తి చేయొచ్చు కాబట్టి ఈ సినిమాకు ఏమీ ఇబ్బందులు ఉండకపోవచ్చు.
అయితే వెంకీతో చేయబోయే ఈ ప్రాజెక్టు త్రివిక్రమ్ చాలా పెద్ద సవాల్ కానుంది. ఆల్రెడీ గతంలో వెంకీ- త్రివిక్రమ్ కలయికలో నువ్వు నాకు నచ్చావ్(Nuvvu naku nachav), మల్లీశ్వరి(Malleswari) లాంటి క్లాసిక్ మూవీస్ వచ్చాయి. కానీ అప్పుడు త్రివిక్రమ్ రైటర్ మాత్రమే. త్రివిక్రమ్ డైరెక్టర్ అయ్యాక వీరిద్దరి కాంబోలో వస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలుంటాయి.
దానికి తోడు త్రివిక్రమ్ ఈ సినిమా కోసం కొత్త కథను, సరికొత్త వినోదాన్ని అందించాలి. అనిల్ రావిపూడి(Anil Ravipudi) అందించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాను టచ్ చేయలేడు. పైగా ఈ సినిమా కూడా సంక్రాంతికే అంటున్నారు. అన్నింటికంటే ముఖ్యమైనది త్రివిక్రమ్ ఈ మూవీతో తన రేంజ్ ను ప్రూవ్ చేసుకోలేకపోతే తను బన్నీతో చేసే ప్రాజెక్టు పై ఆ ఎఫెక్ట్ పడనుంది.






