వెంకటేష్ వివాదానికి ఫుల్స్టాప్ లేదా?
కేరాఫ్ కంచెరపాలెం డైరెక్టర్ వెంకటేష్ మహా టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ఎప్పుడైతే అతను కెజిఎఫ్ మూవీని విమర్శిస్తూ కామెంట్ చేశాడో అప్పటిదాకా ఆయన్ను మెచ్చుకున్నవాళ్లే తర్వాత నుంచి కామెంట్స్ చేస్తున్నారు. వెంకటేష్ చేసిన కామెంట్స్ వల్ల అతను చాలా మంది దృష్టిలో నెగిటివ్‌గా మారాడు.
రీసెంట్ గా మరోసారి కూడా వెంకటేష్ మహా డంకీ మూవీ రిలీజ్ గురించి ఓ పోస్ట్ చేశాడు. తర్వాతి రోజు సలార్ రిలీజ్ ఉంది కాబట్టే వెంకటేష్ కావాలని ఈ ట్వీట్ చేశాడని ప్రభాస్ ఫ్యాన్స్ తనపై ఎటాక్ చేయడంతో ట్విట్టర్ అకౌంట్‌ను డిలీట్ చేశాడు. నచ్చని సినిమాను విమర్శించడం మంచిదే కానీ అదేదో కావాలని చేయడం మాత్రం కరెక్ట్ కాదు.
అయితే మళ్లీ వెంకటేష్ మహా తిరిగి ట్విట్టర్ లోకి వచ్చాడు. తను డైరెక్ట్ చేసిన కేరాఫ్ కంచెరపాలెం సినిమా ఐఎండిబి టాప్ 250 రేటెడ్ మూవీస్ లో 14వ ప్లేస్ లో నిలిచిందన్న విషయాన్ని ట్విట్టర్లో షేర్ చేశాడు. వెంకటేష్ తిరిగి ట్విట్టర్ లోకి రావడంతో అతనిపై మళ్లీ విరుచుకుపడేందుకు ప్రభాస్ ఫ్యాన్స్ రెడీ అయ్యారు. మరి ఇదెప్పటికి ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి.













