Venkatesh: దృశ్యం3.. వెంకీ ఆలోచనేంటి?
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohan Lal) దృశ్యం 3(Drishyam3)ని నిన్న అధికారికంగా అనౌన్స్ చేశాడు. జీతూ జోసెఫ్ (Jeethu Joseph) దర్శకత్వంలో అతి త్వరలో ఇది స్టార్ట్ కానుందని చెప్పాడు. ఫ్యామిలీ థ్రిల్లర్ జానర్ లో రూపొందనున్న ఈ సినిమా మూడో పార్ట్ మరిన్ని ట్విస్టులతో థ్రిల్ చేయడానికి రెడీ అయిందని తెలుస్తోంది. అయితే దృశ్యం సినిమాను బాలీవుడ్ లో అజయ్ దేవగన్(Ajay Devgan), టాలీవుడ్ లో వెంకటేష్(Venkatesh) రీమేక్ చేసిన విషయం తెలిసిందే.
మరిప్పుడు దృశ్యం3 విషయంలో వెంకీ లేట్ చేయకుండా మలయాళ వెర్షన్ పూర్తవగానే రీమేక్ చేస్తాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. దానికి కారణం లేకపోలేదు. సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunnam)తో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న వెంకీ(Venky), తన తర్వాతి సినిమాల ఎంపిక విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఆల్రెడీ ఇప్పటికే ఇద్దరు డైరెక్టర్లు వెంకీకి కథలు చెప్పినప్పటికీ వాటిని హోల్డ్ లో పెట్టాడు వెంకీ.













