వీరుదేవ్గణ్ ఇకలేరు
ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్‌దేవ్‌గణ్‌కు పితృ వియోగం కలిగింది. గతంలో బాలీవుడ్లో స్టంట్ మాస్టర్‌గా పేరు గాంచిన ఆయన తండ్రి వీరుదేవ్గణ్ ముంబాయిలో కన్నుమూశారు. ఆయనకు ఇద్దరు కుమారులు అజయ్‌దేవ్‌గణ్‌తో పాటు దర్శకుడు అనిల్ దేవ్‌గణ్ ఉన్నారు. గత కొంతకాలంగా వీరుదేవ్గణ్ అనారోగ్యంతో ఉన్నారు. 70,80 దశకాలంలో పలు విజయవంతమైన బాలీవుడ్ చిత్రాలకు స్టంట్ మాస్టర్‌గా ఆయన పనిచేశారు. వాటిలో అమితాబ్ నటించిన చిత్రాలు కూడా ఉన్నాయి. దాదాపు 80 చిత్రాలకు స్టంట్స్ అందించడంతో పాటు దర్శక, నిర్మాతగా కూడా ఆయన తన అభిరుచిని చాటుకున్నారు. హిందుస్థాన్ కి కసమ్ చిత్రాన్ని స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కించారు. వీరుదేవ్ మృతిపట్ల బాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు.













