VD14: వీడీ14 లేటెస్ట్ అప్డేట్
విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) హీరోగా రాహుల్ సాంకృత్య్సన్(rahul sankrithyan) దర్శకత్వంలో రీసెంట్ గా ఓ సినిమా మొదలైన విషయం తెలిసిందే. రాయలసీమ నేపథ్యంలో బ్రిటీష్ పాలనా కాలంలో ఇప్పటివరకు ఎవరూ తెరకెక్కించని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందనున్నట్లు మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు.
మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) బ్యానర్ భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్నా(rashmika mandanna) హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా సెట్ వర్క్ మొత్తం పూర్తి చేసుకుని జులై, ఆగస్టు నుంచి రెగ్యులర్ షూట్ కు వెళ్లనున్నట్లు సమాచారం. విజయ్ కెరీర్లో 14వ సినిమాగా వస్తున్న వీడీ14(VD14)లో తన లుక్ మిగిలిన సినిమాల లుక్స్ కంటే భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది.
ఈ సినిమాలో రష్మిక నటిస్తుండటంతో చిత్రంపై మంచి బజ్ ఏర్పడింది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన గీత గోవిందం(Geetha Govindam), డియర్ కామ్రేడ్(Dear Comrade) సినిమలకు సపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉంది. దానికి తోడు ప్రస్తుతం రష్మిక ఏ సినిమా చేసినా పాన్ ఇండియా లెవెల్ లో హిట్ అవుతుంది. విజయ్ సినిమాకు కూడా ఈ అంశం కలిసొస్తుందని నమ్ముతున్నారు.













