రూమర్లపై క్లారిటీ ఇచ్చిన చిరూ డైరెక్టర్
బింబిసార డైరెక్టర్‌తో మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్లో 156వ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. విశ్వంభర అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా రీసెంట్‌గానే సెట్స్ పైకి వెళ్లింది. సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో రూపొందనున్న ఈ సినిమాలో చిరంజీవిని సరికొత్తగా ప్రెజెంట్ చేయబోతున్నాడు వశిష్ఠ.
అయితే ఈ సినిమా గురించి గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ సినిమా జగదేకవీరుడు అతిలోకసుందరికి సీక్వెల్ గా ఉండబోతుందని వస్తున్న వార్తలపై రీసెంట్ గా డైరెక్టర్ క్లారిటీ ఇచ్చాడు. మెగాస్టార్ తో తాను చేయబోయే సినిమా ఏ సినిమాకూ సీక్వెల్ కాదని, ఇదొక కొత్త కథని చెప్పాడు వశిష్ఠ.
ఈ సినిమా చాలా కొత్తగా ఉంటుందని, విశ్వంభరతో ఓ కొత్త ప్రపంచాన్ని చూపిస్తానని చెప్పిన వశిష్ఠ, వీలైనంత తక్కువ టైమ్ లో ఈ సినిమాను పూర్తి చేయాలని చూస్తున్నట్లు చెప్పాడు. ఈ సినిమాలో ఇప్పటికే పలువురు హీరోయిన్లను పరిశీలించగా, త్రిషను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో అనుష్క కూడా ఒక హీరోయిన్ అన్నారు కానీ అనుష్క నటించే ఛాన్స్ తక్కువగానే ఉంది. త్వరలోనే హీరోయిన్స్ విషయంలో మేకర్స్ నుంచి అనౌన్స్మెంట్ రానున్నట్లు తెలుస్తోంది.













