Varsha Bollamma: ఆ సినిమాను 50సార్లు చూశా

కెరీర్ స్టార్టింగ్ లో సపోర్టింగ్ రోల్స్ చేసిన వర్ష బొల్లమ్మ(Varsha bollamma) ఆ తర్వాత మెల్లిగా హీరోయిన్ గా మారి పలు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. వర్ష తాజాగా నితిన్(nithin) హీరోగా నటించిన తమ్ముడు(thammudu) సినిమాలో ఓ హీరోయిన్ గా నటించింది. తమ్ముడులో సప్తమి గౌడ(saptami gowda) మెయిన్ హీరోయిన్ గా నటించగా, వర్ష మరో హీరోయిన్ గా నటించింది. శుక్రవారం రిలీజైన తమ్ముడు సినిమాలో వర్ష నటనకు మంచి మార్కులే పడ్డాయి.
తమ్ముడు సినిమా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొన్న వర్ష బొల్లమ్మ ఆ ప్రమోషన్స్ లో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది. అందులో భాగంగానే మాస్ మహారాజా రవితేజ(raviteja), అనుష్క(Anushka) ప్రధాన పాత్రల్లో రాజమౌళి(rajamouli) దర్శకత్వంలో వచ్చిన విక్రమార్కుడు(Vikramarkudu) సినిమాను తాను 50 సార్లు చూసినట్టు వర్ష బొల్లమ్మ తెలిపింది. సమ్మర్ హాలిడేస్ లో తాను తన కజిన్ వాళ్ల ఇంటికి వెళ్లగా అక్కడ ప్రతీరోజూ విక్రమార్కుడు సినిమా చూశానని వర్ష చెప్పింది.
తన కజిన్ సిస్టర్ కు విక్రమార్కుడు సినిమాలోని సాంగ్స్ అంటే ఎంతో ఇష్టమని, పాటల కోసం ప్రతీ రోజూ ఆమె విక్రమార్కుడు సినిమా చూసేదని, ఆమె వల్ల తాను కూడా ఆ సినిమా చూడాల్సి వచ్చిందని చెప్పిన వర్ష, ఆ టైమ్ లో తనకు తెలుగు సరిగా రాదని తెలిపింది. తెలుగు రాకపోయినా సినిమాలోని డైలాగ్స్ మొత్తం తనకు గుర్తున్నాయని, రెండు మూడు సార్లు చూశాక విక్రమార్కుడు చాలా అద్భుతంగా అనిపించిందని వర్ష బొల్లమ్మ పాత రోజులను గుర్తు చేసుకుంది.