వారీసు, తునివు ఓటీటీ ప్లాటుఫార్మ్స్ ఫిక్స్…
కోలీవుడ్ లో సంక్రాంతి బరిలో ఇద్దరు సూపర్ స్టార్స్ మధ్య ఫైట్ ఓ రేంజ్ లో జరుగుతుంది. విజయ్ వారిసు, అజిత్ తునివు రెండు సినిమాలు సంక్రాంతి రేసులో ఉన్నాయి. మామూలుగానే ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య ఉన్న గొడవలు అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవ్వడంతో కోలీవుడ్ వాతావరణం మరింత టెన్షన్ గా మారింది.
విజయ్ హీరోగా నటించిన వారీసు సినిమాను వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేయగా, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను ఎమోషనల్ గా మెప్పించేందుకు వచ్చింది వారిసు. ఇక అజిత్ తునివు మాత్రం మరోసారి ఆయన మార్క్ మాస్ అంశాలతో వచ్చింది. ఈ రెండు సినిమాలు తమిళం లో రిలీజై అటు ఫాన్స్ ని, ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించాయి.
తాజాగా వారిసు, తునివు సినిమాల ఓటీటీ ప్లాటుఫార్మ్స్ ఫిక్స్ అయినట్టుగా సమాచారం అందుతుంది. విజయ్ వారిసు సినిమాను ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకోగా, అజిత్ తునివు సినిమా హక్కులను నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. రెండు సినిమాలకు ఓటీటీలో భారీ ధర పలికినట్టు సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. థియేట్రికల్ రిలీజ్ అయ్యాక, బాక్సాఫీస్ వద్ద అనుకున్న కలెక్షన్లు క్రాస్ అయిన తర్వాతే ఈ సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతాయి. ఇక వారిసు సినిమాను తెలుగులో “వారసుడు”గా రిలీజ్ చేస్తున్నారు. తెలుగు వర్షన్ జనవరి 14న రిలీజ్ అవుతుండగా, అజిత్ తునివు మాత్రం “తెగింపు”గా నేడు థియేటర్లలో రిలీజైంది.













