లవ్ & హారర్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ‘వలపు సౌధం’
సాయికిరణ్, ప్రాచి అధికారి హీరో హీరోయిన్లుగా ‘మాజీ మిస్టర్ ఆంధ్ర’ బల్వాన్ ప్రధాన పాత్రలో తుల్జా భవాని ఫిలింస్ పతాకంపై పి.విజయ శేఖర్ సమర్పణలో కృష్ణమోహన్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ సునీల్‌సాగర్, మజ్ను సొహ్రాబ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘వలపు సౌధం’. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ చిత్రం ఆడియోని త్వరలో విడుదల చేసి చిత్రాన్ని దీపావళి కానుకగా విడుదల చేస్తామని దర్శక నిర్మాతలు తెలిజేసారు.
ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన సునీల్ సాగర్ మాట్లాడుతూ.. ‘లవ్ & హార్రర్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని రూపొందించామని, ఈ చిత్రంలో ఏడు పాటలున్నాయని, నూతన సంగీత దర్శకుడు ఎస్.కె.మజ్ను స్వరపరచిన పాటలు శ్రోతలను అలరిస్తాయని, ఈ చిత్రానికి ఆర్.ఆర్.అద్భుతంగా చేస్తున్నారని పాటలతోపాటు చిత్రం కూడా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం’ అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ.. ‘నువ్వే కావాలి, ప్రేమించు’ చిత్రాల తర్వాత సాయికిరణ్‌కు ఈ చిత్రం మంచి బ్రేక్ ఇవ్వగలదని, అలాగే మాజీ మిస్టర్ ఆంధ్ర బల్వాన్ ఈ చిత్రంలో పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా నటిస్తున్నారని ఈ క్యారెక్టర్ ఈ చిత్రానికి హైలెట్ అవుతుందని ఇంతమంచి చిత్రానికి దర్శకుడిగా అవకాశమిచ్చిన నిర్మాతలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
ఇంకా ఈ చిత్రంలో సత్యప్రకాష్, జీవా, కవిత, కోట శంకర్రావు, సంపత్‌రాజ్, తిరుపతి ప్రకాష్, దిల్ రమేష్, నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: యాదగిరి, ఫైట్స్ : సూపర్ ఆనంద్, ఎడిటింగ్ : సాయి శ్రీనివాస్, ఆర్ట్ : నాగేశ్వరరావు, డ్యాన్స్ : బ్రదర్ ఆనంద్, కథ-స్క్రీన్‌ప్లే- మాటలు-పాటలు-సంగీతం : ఎస్.కె.మజ్ను. సహనిర్మాతలు : మజ్ను రెహాన బేగం, కె.ఫిష్‌లక్ష్మి, నిర్మాతలు : సునీల్ సాగర్, మజ్ను సొహ్రాబ్, దర్శకత్వం : కృష్ణ మోహన్.













