పవన్-సురేందర్ రెడ్డి మూవీపై వక్కతం వంశీ క్లారిటీ
పవన్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలున్నాయి. ఇందులో ఏదీ పూర్తి కాలేదు. పవన్ డేట్స్ అడ్జస్ట్ చేస్తే ఓజీ, ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమాలు త్వరగా పూర్తవుతాయి. కానీ రాజకీయ పరిస్థితుల దృష్ట్యా పవన్ బిజీ అవడంతో ఈ సినిమాలు ఎప్పుడు పూర్తవుతాయనేది ఎవరికీ తెలియని పరిస్థితులు కనిపిస్తున్నాయి.
సిట్యుయేషన్స్ చూస్తుంటే పవన్ ఈ సినిమాలన్నింటినీ ఏపీ ఎలక్షన్స్ తర్వాతే పూర్తి చేసేలా కనిపిస్తున్నాడు. అయితే పవన్ ఈ మూడు సినిమాలతో పాటూ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో సినిమా కోసం రామ్ తాళ్లూరి దర్శకత్వంలో ఓ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు పవన్ ఇప్పటికే అడ్వాన్స్ కూడా తీసుకున్నాడని టాక్.
ఆల్రెడీ మొదలైన సినిమాలనే పూర్తి చేయలేక పోతుంటే ఇక కొత్త సినిమాలా అనుకుంటున్న టైమ్ లో సురేందర్ రెడ్డి-పవన్ కాంబోలో రానున్న సినిమా గురించి, దానికి కథ అందిస్తున్న వక్కంతం వంశీ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. కథ చెప్పినప్పుడు పవన్ చాలా ఎగ్జైట్ అయ్యాడని, ఎప్పుడు చేద్దామని అడిగినట్లు తెలిపాడు. ఈ సినిమా తప్పకుండా చేస్తానని పవన్, సురేందర్ రెడ్డికి మాటిచ్చినట్లు వంశీ తెలిపాడు.













