Vaa Vaathiyaar: కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్న కార్తీ సినిమా

తమిళ టాలెంటెడ్ హీరో కార్తి(karthi) వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. కార్తీకి తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం నలన్ కుమారస్వామి(nalan kumaraswami) దర్శకత్వంలో కార్తీ ఓ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాకు వా వాతియార్(Vaa vaathiyaar) అనే టైటిల్ ను మేకర్స్ ఫిక్స్ చేయగా అందులో కృతి శెట్టి హీరోయిన్ నటిస్తోంది.
ఉప్పెన(Uppena) సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న కృతి శెట్టి(Krithi Shetty), కార్తీతో చేస్తున్న మొదటి సినిమా ఇదే. ఈ సినిమాపై అందరికీ మంచి అంచనాలుండగా, వా వాతియార్ ను ఈ దీపావళి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు వా వాతియర్ అనుకున్న డేట్ కు రిలీజ్ కాలేకపోతుంది.
సినిమాకు సంబంధించిన పనులు ఇంకా పూర్తవని నేపథ్యంలో వా వాతియార్ ను దీపావళి రేసు నుంచి మేకర్స్ తప్పించి కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. దీపావళి నుంచి ఈ సినిమాను డిసెంబర్ 5కి వాయిదా వేస్తూ చిత్ర బృందం ఓ సరికొత్త పోస్టర్ ను రిలీజ్ చేసింది. సంతోష్ నారాయణన్(santhosh narayanan) సంగీతం అందిస్తున్న ఈ సినిమాను స్టూడియో గ్రీన్ (Studio Green) నిర్మిస్తోంది.