Utkarsh Sharma: పోటీ వల్ల మా సినిమా ఆడలేదు
గత డిసెంబర్ లో వచ్చిన పుష్ప2(pushpa2) సినిమా ఎన్ని సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమా వల్ల ఎన్నో సినిమాలు తమ రిలీజ్ డేట్స్ ను వాయిదా వేసుకున్నాయి. పుష్ప2కు నార్త్ లో ఆడియన్స్ బ్రహ్మరథం పట్టిన సంగతి తెలిసిందే. పుష్ప2 థియేటర్లలో ఉన్నప్పుడు నార్త్ ఆడియన్స్ లోకల్ సినిమాను కూడా పట్టించుకోలేదు.
రీసెంట్ గా ఈ విషయంపై బాలీవుడ్ యువ హీరో ఉత్కర్ష్ శర్మ(Utkarsh Sharma) మాట్లాడాడు. పుష్ప2 సినిమా వల్ల తమ సినిమా నలిగిపోయి చనిపోయిందని అన్నాడు. గతేడాది డిసెంబర్ 20న నానా పటేకర్(nana patekar), ఉత్కర్ష్ శర్మ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వనవాస్(vanavas) మూవీ రిలీజైంది. ఆ సినిమాకు ఆడియన్స్ నుంచి మిక్డ్స్ టాక్ వచ్చింది. అయితే తమ సినిమాకు అనుకున్న ఫలితం రాకపోవడానికి కారణం అదే టైమ్ లో రిలీజైన సినిమాలని ఉత్కర్ష్ శర్మ తెలిపాడు.
అదే టైమ్ లో పుష్ప2, బేబీ జాన్(baby john) సినిమాలు రిలీజయ్యాయని, వాటి మధ్యలో తమ సినిమా నలిగిపోయిందని, ఫస్ట్ వీక్ లో తమ సినిమాకు మంచి టాక్ వచ్చినప్పటికీ తర్వాత స్క్రీన్స్ దొరక్క అనుకున్న స్థాయిలో ఆడియన్స్ కు చేరుకోలేకపోయిందని, దాని వల్ల మంచి కలెక్షన్లు రాలేదని ఇండియాలో స్క్రీన్లు చాలా తక్కువ ఉన్నాయని భవిష్యత్తులో పోటీ లేకుండా సినిమాలు రావాలని ఉత్కర్ష్ తెలిపాడు.






