Uppu Kappurambu: ఆ సినిమాతో మెసేజ్ ఇవ్వనున్న కీర్తి
ఇండస్ట్రీలో కొన్ని కలయికలను అసలు ఎవరూ ఊహించం. అలాంటి కలయికల్లో ఒకటి సుహాస్(Suhaas), కీర్తి సురేష్(Keerthy Suresh). వీరిద్దరూ కలిసి ఉప్పు కప్పురంబు(Uppu Kappurambu) అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అని. ఐ. వి శశి(Ani I.V Sasi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు వసంత్ మరళీ కృష్ణ(Vasanth Murali Krishna) కథ అందిస్తుండగా, ఎల్లనార్ ఫిల్మ్స్ ప్రై. లి(Ellanar Films Private Limited) బ్యానర్ పై రాధికా లావు(Radhika Laavu) నిర్మిస్తున్నారు.
ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ కానుండగా, ఇప్పుడు ఆ ఓటీటీ రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. ఉప్పు కప్పురంబు సినిమా జులై 4 నుంచి ప్రపంచ వ్యాప్తంగా 240కు పైగా దేశాల్లో ప్రైమ్ వీడియోలో స్పెషల్ గా ప్రీమియర్ కానున్నట్టు తెలిపారు. తెలుగులో రిలీజ్ కానున్న ఈ సినిమా తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో డబ్బింగ్ తో అందుబాటులోకి రానుంది.
90ల బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ సినిమాలో సెటైర్, కామెడీతో పాటూ ఓ సామాజిక సమస్య గురించి కూడా ప్రస్తావించినట్టు మేకర్స్ తెలిపారు. ఈ సినిమా ఆహ్లాదకరంగా, సెటైరికల్ గా ఉంటూనే ఆడియన్స్ ను ఎంతో ఆలోచింపచేసేదిగా ఉండనుందని, ఎంతో కాలంగా ఈ కథను తెరపైకి తీసుకుని రావాలనుకుంటున్నట్టు డైరెక్టర్ శశి తెలిపాడు.






