రాజమౌళి లెక్కలు అంతుచిక్కడం లేదుగా
గుంటూరు కారం సినిమాతో మంచి హిట్ అందుకున్న మహేష్ బాబు, తన 29వ సినిమాను దర్శకధీరుడు రాజమౌళితో చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఇంకా షూటింగ్ మొదలవకుండానే ఇండస్ట్రీ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమాకు సెంథిల్ ను కాదని సినిమాటోగ్రాఫర్ గా పిఎస్ వినోద్‌ను తీసుకున్నారు.
సెంథిల్ త్వరలో డైరెక్టర్ గా మారి మెగా ఫోన్ పట్టబోతుండటమే దీనికి రీజన్ అంటున్నారు. గుంటూరు కారంకు కొంత భాగం సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించిన వినోద్ ఆ తక్కువ టైమ్ లోనే తన పనితనంతో మహేష్ ను ఇంప్రెస్ చేశాడని, మహేష్ చెప్పడం వల్లే వినోద్ ను రాజమౌళి కన్సిడర్ చేశాడని అంటున్నారు.
విఎఫ్ఎక్స్ బాధ్యతలు కూడా శ్రీనివాస్ మోహన్ కు కాకుండా కమల్ కన్నన్ కు ఇచ్చాడు రాజమౌళి. ఈ స్పెషల్ ఛేంజెస్‌కు సంబంధించి ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన వర్క్ షాప్స్ జరుగుతున్నాయి. క్యాస్టింగ్, వారి డేట్స్ ఫైనల్ అయ్యాక మీడియాకు అఫీషియల్ గా ప్రెస్ మీట్ పెట్టి వివరాలను వెల్లడించనున్నాడు జక్కన్న. అన్ని సినిమాల్లానే దీనికి కూడా అనౌన్స్మెంట్ టైమ్ లోనే రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది.













