దసరా నుంచి ఆ రెండు సినిమాలు తప్పుకున్నట్లేనా?
ఇంకో నాలుగు నెలలు టైమ్ ఉండగానే దసరాకు సినిమాలు షెడ్యూల్ అయ్యాయి. సంక్రాంతి రేంజ్లో స్టార్ హీరోలు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడటానికి రెడీ కాబోతున్నారు. అయితే డిస్ట్రిబ్యూటర్ ఒత్తిడి వల్ల ఇందులో మార్పులు చోటు చేసుకునే ఛాన్సుందని ఇన్సైడ్ టాక్. దసరాకు రిలీజ్ కాబోయే సినిమాల్లో బాలయ్య భగవంత్ కేసరి ఒకటి. ఈ మూవీ రిలీజ్ విషయంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు.
ఈ సినిమా ఎప్పుడో దసరాను లాక్ చేసుకుంది. దీంతో పాటూ రవితేజ హీరోగా వస్తున్న టైగర్ నాగేశ్వరరావు కూడా పోస్ట్‌పోన్ అయ్యే ఛాన్స్ లేదు. రామ్- బోయపాటి కాంబోలో రానున్న సినిమా ప్రీపోన్ అవనుందని టాక్. బాలయ్యతో పోటీ పడటం ఇష్టం లేని బోయపాటి, నిర్మాతలను ఒప్పించి వీలైనంత త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ చేయించి కుదిరితే సెప్టెంబర్ లోనే సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
ఇక దసరానే టార్గెట్ చేసుకున్న లియో కూడా వారం ముందుగానే థియేటర్లకు వచ్చే ఛాన్సుంది. ఈ మేరకు లోకేష్ కనగరాజ్ తన టీమ్‌తో డిస్కషన్స్ చేస్తున్నాడు. ఒకవేళ విజయ్ ఒప్పుకుంటే మాత్రం లియో కూడా దసరా బరి నుంచి తప్పుకున్నట్లే. ఒకవేళ కాదని దసరాకే లియోని రిలీజ్ చేస్తే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు థియేటర్ల సమస్య తలెత్తడం ఖాయం.
అందుకే లోకేష్ ఈ సినిమాకు సోలో రిలీజ్ బెటర్ అనుకుని వారం ముందుగా రిలీజ్ చేయాలని చూస్తున్నాడు. మరి అందుకు విజయ్ ఒప్పుకుంటాడో లేక థియేటర్ల ప్రాబ్లమ్ ని ఎదుర్కొంటాడో చూడాల్సి ఉంది. ఏ విషయం మరి కొద్ది రోజుల్లోనే తెలియనుంది.













