కరోనాకు మరో నటి బలి
కరోనా మహమ్మారి వలన చాలా మంది సెలబ్రిటీలు కన్నుమూసిన సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్ టీవీ నటి దివ్య భట్నాగర్(34) మృతి చెందారు. యే రిష్టా క్యా కెహ్లతా హై, తేరా యార్ హూన్ మెయిన్ షోలలో నటించి మంచి పేరు తెచ్చుకున్న దివ్య తేరా యార్ హూన్ మెయిన్ షూటింగ్లో సమయంలో కరోనా బారిన పడింది. అనారోగ్యంతో ఇబ్బంది పడ్డ దివ్వ కొద్ది రోజులుగా ముంబైలోని సెవెన్‌హిల్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుంది. ఆమె పరిస్థితి విషమించడంతో వైద్యులు ఆమెకు వెంటిలెటర్‌పై చికిత్స అందించారు. అయితే అధిక రక్తపోటు, కరోనా రెండు అటాక్ చేయడంతో తిరిగి రాని లోకానికి వెళ్లారు. ఏ రిషిత్య క్యా కెహలాతా హై, సంస్కార్, ఉడాన్, జీత్ గయి తొహ్ పియా మోర్రే వంటి సిరీయల్స్‌లో నటించి దివ్వ ఇక లేరని తెలిసిన అభిమానులు కన్నీటి పర్వంతం అవుతున్నారు. పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు.













