నా పోరాటానికి ఫలితం దక్కింది…శ్రీరెడ్డి
తెలుగు చిత్రపరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్‌కు వ్యతిరేకంగా నటి శ్రీరెడ్డి చేసిన పోరాటం ఎట్టకేలకు ఫలించింది. టాలీవుడ్లో లైంగిక వేధింపులపై కమిటీని ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జోవో విడుదల చేసింది. కేసీఆర్ సర్కారు స్పందనపై శ్రీరెడ్డి సోషల్ మీడియా ద్వారా స్పందించింది. తన పోరాటం ఫలించిందని సంతోషం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపింది. నా కల ఈ నాటికి సాకారమైంది. మీ చొరవతో నేనిప్పుడు ప్రపంచానికే హీరోయిన్ను అయ్యాను. ఏడాదిగా నేను అనుభవించిన బాధకు నేడు ఫలితం దక్కింది. ఆ రోజు నేను చేసిన అర్థ నగ్న ప్రదర్శనకు ఫలితమే ఇది. నేను చేసిన ఈ ఉద్యమంలో నాకు వెన్నంటి ఉండి సాయపడిన సంధ్య, వసుధ, సజయ్, తేజ్ అందరికీ కృతజ్ఞతలు. ముఖ్యంగా అపూర్వకు చాలా థ్యాంక్స్ అని అన్నారు.













