మహేష్, త్రివిక్రమ్ సినిమా టైటిల్ అదేనా?
మహేష్ బాబు, త్రివిక్రమ్ కలయికలో దాదాపు 12 ఏళ్ల తర్వాత #SSMB28 వర్కింగ్ టైటిల్ పేరిట ఓ భారీ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. అతడు, ఖలేజా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా ఇది. ఎప్పుడో రెండు నెలల క్రితమే లాంఛనంగా పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ మూవీ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అనుకోగా, సోమవారం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది.
తన గత చిత్రాల కంటే పూర్తి భిన్నంగా ఈ మూవీని మహేష్ భారీ యాక్షన్ ఎపిసోడ్‌తో స్టార్ట్ చేశాడు. ఈ షెడ్యూల్లో హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్ని మహేష్ పై చిత్రీకరించేలా ప్లాన్ చేశాడు త్రివిక్రమ్. దీనికోసం ఫిల్మ్ సిటీలో సెట్ కూడా వేశారు. ఇదిలా ఉంటే ఈ సినిమా టైటిల్ ఇదేనంటూ ఇప్పుడు ఓ వార్త నెట్టింట వైరల్‌గా అవుతోంది.
సినిమా షూటింగ్ అయిన విషయాన్ని వెల్లడిస్తూ #SSMB28Arambham అనే హ్యాష్ ట్యాగ్‌తో ఓ వీడియోను రిలీజ్ చేసింది చిత్ర బృందం. దీంతో సినిమాకు ఆరంభం అనే టైటిల్‌ను ఫైనల్ చేస్తున్నారు కాబట్టే ఆ హ్యాష్ ట్యాగ్‌తో నెట్టింట వైరల్ అయ్యేలా చేశారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ A సెంటిమెంట్ ప్రకారం చూస్తే ఈ వార్త నిజమయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలోనే వచ్చే ఛాన్సుంది.













