Trivikram: త్రివిక్రమ్ సిట్యుయేషన్ ఇలా అయిందేంటి?

రచయితగా కెరీర్ ను స్టార్ట్ చేసిన త్రివిక్రమ్(Trivikram) ఆ తర్వాత డైరెక్టర్ గా మారి టాలీవుడ్ లోని స్టార్ హీరోలందరితో పలు హిట్ సినిమాలు చేసి స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. అలాంటి త్రివిక్రమ్ గత కొంత కాలంగా సినిమాను సెట్ చేయడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నాడు. అల వైకుంఠపురములో(Ala Vaikunthapurramulo) తర్వాత ఎన్టీఆర్(NTR) తో ఓ సినిమా చేయాల్సి ఉండగా అది క్యాన్సిల్ అయి, మహేష్ బాబు(Mahesh Babu)తో ఓ కథను లాక్ చేసుకున్నాడు.
ఒక కథతో సెట్స్ పైకి వెళ్లిన ఈ కాంబో కథను మార్చి గుంటూరు కారం(Guntur Karam) చేశారు. ఆ సినిమా ఇప్పటికీ త్రివిక్రమ్ డైరెక్ట్ చేశాడంటే నమ్మబుద్ధి అవదు. గుంటూరు కారం సినిమా గతేడాది సంక్రాంతికి రిలీజైంది. ఇప్పటికీ త్రివిక్రమ్ తన తర్వాతి సినిమాను మొదలుపెట్టింది లేదు. అల్లు అర్జున్(Allu Arjun) తో సినిమా చేద్దామని అనౌన్స్ కూడా చేశాడు కానీ బన్నీ(Bunny) ఇప్పుడు త్రివిక్రమ్ కంటే ముందు అట్లీ(Atlee)తో కలిసి సెట్స్ పైకి వెళ్తున్నాడు.
గుంటూరు కారం తర్వాతి నుంచి మొన్నటివరకు త్రివిక్రమ్ ఆ కథపైనే వర్క్ చేశాడు. భారీ బడ్జెట్ తో మైథలాజికల్ స్టోరీతో పాన్ ఇండియా లెవెల్ లో ఆ సినిమాను తీయనున్నట్టు నిర్మాత నాగవంశీ(Naga Vamsi) కూడా పలుమార్లు చెప్పాడు. కానీ బన్నీ మాత్రం అట్లీతో ముందుకెళ్లాడు. దీంతో త్రివిక్రమ్ మరోసారి ఖాళీ అయ్యాడు. వెంకటేష్ తో సినిమా అంటున్నారు కానీ అది కూడా పట్టాలెక్కే వరకు నమ్మలేం. ఒకవేళ పట్టాలెక్కి సినిమా చేసినా అది టాలీవుడ్ వరకు మాత్రమే రూపొందుతుంది. త్రివిక్రమ్ తో పాటూ కెరీర్ ను స్టార్ట్ చేసిన డైరెక్టర్లంతా పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతుంటే త్రివిక్రమ్ పాన్ ఇండియా ఎంట్రీకి మాత్రం ముహూర్తం కుదరడం లేదు. మరి ఆ టైమ్ ఎప్పుడొస్తుందో ఏంటో.