గురూజీ రూటు మార్చాల్సిన టైమొచ్చింది
ఈ మధ్య త్రివిక్రమ్ సినిమాల్లో ఉన్న కంటెంట్ పై వస్తున్న విమర్శలు అన్నీ ఇన్నీ కావు. రీసెంట్ గా మహేష్ బాబు తో తీసిన గుంటూరు కారం సినిమా విషయంలో ఈ విమర్శల తాకిడి మరీ ఎక్కువైంది. అందుకే సినిమా రిలీజయ్యాక మీడియా ముందుకు కూడా త్రివిక్రమ్ రాలేకపోయాడు. ఈ సినిమాకు డే-1 ఎలాంటి టాక్ వచ్చిందో తెలిసిందే.
గుంటూరు కారం సినిమా అత్తారింటికి దారేదికి సీక్వెల్ గా ఉందని ఫ్యాన్సే విమర్శించారు. కానీ మహేష్ బాబు కు ఉన్న బాక్సాఫీస్ స్టామినా సినిమాను నిలబెట్టింది. ఎలాగైతేనేం త్రివిక్రమ్ నుంచి వచ్చే సినిమాల్లో ఫ్యాన్స్ కంటెంట్ లో మార్పులు కోరుకుంటున్నారని అర్థమైపోయింది. సన్నాఫ్ సత్యమూర్తిలో నాన్న సెంటిమెంట్ ను వాడిన గురూజీ, అ..ఆ లో అన్న- చెల్లి సెంటిమెంట్ ను వాడాడు. అరవింద సమేతలో మళ్లీ అదే నాన్న సెంటిమెంట్, అల వైకుంఠపురములో సినిమాతో అమ్మ సెంటిమెంట్ ను వాడాడు.
అత్తారింటికి దారేదిలో అత్త సెంటిమెంట్, రీసెంట్ గా వచ్చిన గుంటూరు కారంలో అమ్మ సెంటిమెంట్ తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. దీంతో త్రివిక్రమ్ నుంచి గత కొంత కాలంగా సెంటిమెంట్ సినిమాలే వచ్చాయని తెలుస్తోంది. తోటి డైరెక్టర్లు పాన్ ఇండియా స్థాయిలో ఇన్నేవేటివ్ కంటెంట్ తో సినిమాలు తీస్తుంటే త్రివిక్రమ్ మాత్రం ఇంకా రొటీన్ సెంటిమెంట్ సినిమాలకే పరిమితమయ్యాడని ఫ్యాన్స్ కంప్లైంట్ చేస్తున్నారు. ఇక మీదటైనా గురూజీ తన రూట్ మారిస్తేనే తన నుంచి వచ్చే సినిమాలను ఆడియన్స్ ఆదరించే ఛాన్సుంటుంది. లేదంటే గురూజీ సినిమాలకు ఆదరణ తగ్గడం ఖాయం.













