త్రివిక్రమ్ కు ఇక నో ఆప్షన్
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకడైన త్రివిక్రమ్, ముందుగా తన కెరీర్ ను రైటర్ గా మొదలు పెట్టాడు. తన మార్క్ డైలాగ్స్ తో మాటల మాంత్రికుడనే పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ తర్వాత దర్శకుడిగా మారి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను తీశాడు. కానీ రీసెంట్ గా తన నుంచి వచ్చిన గుంటూరు కారం సినిమా విషయంలో మాత్రం ఫ్యాన్స్ చాలా నిరాశ పడ్డారు.
గుంటూరు కారం సినిమా మంచి కలెక్షన్స్ ను రాబట్టినప్పటికీ అది త్రివిక్రమ్ స్థాయి సినిమా కాదని అందరూ యునానిమస్ గా కామెంట్స్ చేస్తున్నారు. అల వైకుంఠపురములో తర్వాత నాలుగేళ్లు గ్యాప్ తీసుకుని మరీ త్రివిక్రమ్ ఇలాంటి సినిమా చేస్తాడా అని అందరూ పెదవి విరుస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు త్రివిక్రమ్ తన తర్వాతి సినిమాను ఎవరితో చేయనున్నాడనేది ఆసక్తిగా మారింది.
వాస్తవానికైతే పుష్ప2 తర్వాత బన్నీ, త్రివిక్రమ్ తో సినిమా చేయాల్సి ఉంది. కానీ పుష్ప2 తర్వాత బన్నీ పాన్ ఇండియా సినిమాలకే ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. అంటే పుష్ప2 తర్వాత బన్నీ-త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ఉండకపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక ఎన్టీఆర్ కాంబోలో సినిమా ఉంటుందా అంటే ఎన్టీఆర్ పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.
ఎన్టీఆరే కాదు టాలీవుడ్ స్టార్ హీరోలంతా ఇప్పుడు మల్టిపుల్ సినిమాలతో బిజీగా ఉన్నారు. కాబట్టి ఈ గ్యాప్ లో త్రివిక్రమ్, మీడియం రేంజ్ లేదా సీనియర్ హీరోలతో సినిమాలు చేయడమే బెటరంటున్నారు నెటిజన్లు. దానికి తగ్గటే ఆ మధ్య వెంకీ- నాని కాంబోలో సినిమా రానుందని కూడా వార్తలొచ్చాయి. రామ్ పోతినేనితో కూడా త్రివిక్రమ్ సినిమా ఉండే ఛాన్సుందన్నారు. ఇదిలా ఉంటే త్రివిక్రమ్ మాత్రం తన తర్వాతి సినిమా ఎవరితో చేసినా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని స్క్రిప్ట్ ను రెడీ చేసే పనిలో ఉన్నాడని తెలుస్తోంది.













