మణిరత్నం దర్శకత్వంలో మళ్ళీ ఛాన్స్ కొట్టేసిన త్రిష?
హీరోయిన్ త్రిష సినీఇండస్ట్రీలో అడుగు పెట్టి రెండు దశాబ్దాలకు పైగా పూర్తి అయ్యింది. అయినా కూడా ఇప్పటి వరకు ఈ అమ్మడి స్పీడ్ తగ్గడం లేదు. సీనియర్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా త్రిష కొనసాగుతుంది అంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం ఈ ఈ కోలీవుడ్ బ్యూటీ చేస్తున్న సినిమాల లిస్ట్ చాలా పెద్దగానే ఉందని చెప్పాలి.
లాస్ట్ ఇయర్ పొన్నియన్ సెల్వన్ 1 తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన త్రిష, ఈ ఏడాది పొన్నియన్ సెల్వన్ 2 తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఇదే సమయంలో మరో భారీ డైరెక్టర్ సినిమాలో కూడా త్రిష కు అవకాశం దక్కింది అంటూ నెట్టింట వార్తలు హల్చల్ చేస్తున్నాయి. పొన్నియన్ సెల్వన్ సినిమా తర్వాత మణిరత్నం చేయబోతున్న సినిమా ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యింది.
యూనివెర్సల్ ఐకానిక్ స్టార్ కమల్ హాసన్ తో మణిరత్నం సినిమా ఉండబోతుందంటూ ఇప్పటికే ప్రకటన వచ్చింది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే సినిమాలో హీరోయిన్ గా త్రిష కు ఛాన్స్ దక్కిందని తమిళ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. మణిరత్నం సినిమాల్లో బ్యాక్ టు బ్యాక్ నటించే అవకాశం రావడం అంటే మామూలు విషయం కాదు అంటూ ఈ బ్యూటీ ని అందరు ప్రశంసలతో ముంచెత్తుతున్నారట. ఇలాంటి అవకాశం త్రిష కు వచ్చిందంటే, ఇప్పటికి కూడా ఆమె క్రేజ్, స్టార్ డమ్ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు.













