Trisha: విశ్వంభర నుంచి త్రిష పోస్టర్ రిలీజ్
చిరంజీవి(Chiranjeevi) హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్, బింబిసార(bimbisara) ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా విశ్వంభర. ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష(Trisha) హీరోయిన్ గా నటిస్తుంది. మే 4న త్రిష పుట్టినరోజు సందర్భంగా చిత్ర మేకర్స్ ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ ఆమె పాత్రను పరిచయం చేశారు.
విశ్వంభర సినిమాలో త్రిష అవని(Avani) పాత్రలో నటించనుంది. మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ లో త్రిష అవని పాత్రలో ఎంతో చక్కగా, సంప్రదాయ చీరకట్టులో చూడ ముచ్చటగా మెరిసిపోతుంది. త్రిష బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ఈ పోస్టర్ కు మెగా ఫ్యాన్స్ లైక్స్ కొడుతూ ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.
ఇదిలా ఉంటే త్రిష, చిరూ కలిసి 2006లో స్టాలిన్(Stalin) సినిమాలో నటించారు. ఆ తర్వాత నుంచి వీరిద్దరి కలయికలో మరో సినిమా వచ్చింది లేదు. చాలా కాలం తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో విశ్వంభరపై అందరికీ మంచి అంచనాలున్నాయి. 42 ఏళ్ల వయసులో కూడా త్రిష వరుస పెట్టి సినిమాలు చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం త్రిష చేతిలో థగ్ లైఫ్(Thug life) తో పాటూ సూర్య45(Surya45), రామ్(Ram) సినిమాలున్నాయి.






