త్రిషకు మరో భారీ ఆఫర్ !
మహిళా ప్రధాన చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తున్న త్రిష తాజాగా మరో భారీ ఆఫర్‌ని దక్కించుకుందట. మణిరత్నం దర్శకత్వంలో నటించే అరుదైన అవకాశం ఆమెని వరించినట్టు సమచారం. మణిరత్నం ప్రస్తుతం మల్టీలింగ్వల్‌గా పొన్నియిన్ సెల్వమ్ చిత్రాన్ని రూపొందించే పనిలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇందులో అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, విక్రమ్, విజయ్ సేతుపతి, జయంరవి, మోహన్‌బాబు, కీర్తిసురేష్ వంటి భారీ తారాగణం నటిస్తోంది. తాజాగా ఈ చిత్రంలో ఓ కథానాయికగా, కీలక పాత్ర కోసం త్రిషని ఎంపిక చేశారట. ఇందులో ఆమె పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమా డిసెంబర్లో ప్రారంభం కానుంది.













