త్రిషకు అరుదైన గౌరవం
తమిళ నటి త్రిషకు యునిసెఫ్ ప్రముఖ న్యాయవాది హోదా గౌరవం దక్కింది. పిల్లల, యువతకు సంబంధించిన హక్కుల విషయంలో ఆమె తన గళం వినిపించింది. ఈ నేపథ్యంలో యూనిసెఫ్ ఆమెను న్యాయవాది హోదాతో గౌరవించింది. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో బాల్య వివాహాలు చేయడం, పలుచోట్ల బాలకార్మికులతో వెట్టి చాకిరీ చేయించుకోవడం వంటి అంశాలపై ఆమె పోరాడారు. త్రిష నేటి యువతకు ఆదర్శంగా నిలిచారని తమిళనాడు, కేరళ యూనిసెఫ్ చీఫ్ జాబ్జెకర్యా అభిప్రాయపడ్డారు. బాలల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం ఎంతో ప్రశంసనీయమని అన్నారు. యువతను విద్య, ఆరోగ్యాభివృద్ధితో పాటు ఆడ పిల్లలను చులక చేసిన చూడొద్దంటూ పోరాటం చేశారని అన్నారు. దక్షిణ భారతదేశంలోని సినీ ప్రముఖుల్లో త్రిష మాత్రమే యూనిసెఫ్ నుండి ఓ గుర్తింపు పొందారు. విద్య, వైద్యం, పోషకాహారం, బాలల రక్షణ వంటి విషయాల్లో ప్రజల్లో మరింత అవగాహన పెంచడానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా త్రిష హామీ ఇచ్చింది. తమిళనాడు ప్రభుత్వం కూడా ఈ విషయంలో సహాయ సహకారాలు అందించాలని కోరారు.













