Trisha: ఆ షాక్ కు రెడీ అవమంటున్న త్రిష

మణిరత్నం(Mani ratnam) డైరెక్షన్ లో కమల్ హాసన్(Kamal Haasan), త్రిష(Trisha), శింబు(Simbhu), అభిరామి(abhirami) ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా థగ్ లైఫ్(Thug Life). జూన్ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను వేగవంతం చేయగా, ఆ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న త్రిష సినిమా గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను తెలిపి థగ్ లైఫ్ పై అంచనాలను మరింత పెంచుతుంది.
థగ్ లైఫ్ సినిమాలో త్రిష, కమల్ తో కలిసి రొమాన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఓ వైపు అదే సినిమాలో శింబు ఉండగా, త్రిష కమల్ తో ఎలా రొమాన్స్ చేస్తుందని అందరూ త్రిషను ద్రోహి అంటూ కామెంట్స్ చేస్తుండగా, ఆ కామెంట్స్ పై రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో త్రిష రెస్పాండ్ అయి మాట్లాడింది. అందరూ తనను ద్రోహి అంటున్నారని, సినిమా చూశాక తాను ద్రోహి కాదనే విషయం తెలుస్తుందని చెప్పింది.
థగ్ లైఫ్ లో మూవీ చాలా పెద్ద షాక్ ఉంటుందని, ఆడియన్స్ ఆ షాక్ ను చూడ్డానికి రెడీ అయిపొమ్మని త్రిష ఈ సందర్భంగా చెప్పింది. అమ్మడు చెప్పిందాన్ని బట్టి చూస్తే ఈ సినిమాలో ఎవరూ ఊహించని ట్విస్ట్ ఆడియన్స్ కు షాకిస్తుందని తెలుస్తోంది. ట్రైలర్ లో కూడా శింబు పక్కన ఏ హీరోయిన్ ను చూపింలేదు. సినిమాలో ఉన్న ఇద్దరు హీరోయిన్లు కమల్ పక్కనే ఆడిపాడారు. దీంతో త్రిష చెప్పిన ఆ ట్విస్ట్ ఏంటనేది ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది.