Toxic: యష్ టాక్సిక్ షూటింగ్ అప్డేట్
కెజిఎఫ్(KGF) ఫ్రాంచైజ్ సినిమాలతో కన్నడ హీరో యష్(Yash) పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. కెజిఎఫ్ తర్వాత ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్ ను లైన్ లో పెడతాడో అనుకుంటే యష్ మాత్రం లేడీ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్(Geethu Mohandas) దర్శకత్వంలో ఓ సినిమాను అనౌన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరచడమే కాకుండా తన డెసిషన్ తో అందరికీ షాకిచ్చాడు.
కాగా గీతూ ఈ సినిమాను భారీ తారాగణంతో ఎంతో ప్రిస్టీజియస్ గా తెరకెక్కిస్తోంది. ఏక కాలంలోనే ఇంగ్లీష్ లో కూడా ఈ సినిమాను రూపొందిస్తుంది. టాక్సిక్(Toxic) అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా డ్రగ్స్ నేపథ్యంలో రూపొందుతుండగా ఈ సినిమాకు పలువురు హాలీవుడ్ టెక్నీషియన్లు కూడా పని చేస్తుండటంతో టాక్సిక్ పై మంచి హైప్ ఉంది.
కాగా టాక్సిక్ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తోంది. ఈ మూవీ కోసం మేకర్స్ 45 రోజుల యాక్షన్ షెడ్యూల్ ను ప్లాన్ చేశారని తెలుస్తోంది. మామూలుగా ఎవరైనా సరే యాక్షన్ సీన్స్ ను ఒకేసారి తీయరు. బ్రేక్స్ తీసుకుంటూ పలు షెడ్యూల్స్ లో పూర్తి చేస్తారు కానీ టాక్సిక్ టీమ్ మాత్రం ఈ 45 రోజుల షెడ్యూల్ లోనే కీలక యాక్షన్ సీన్స్ ను తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. ఈ యాక్షన్ సీన్స్ కు హాలీవుడ్ స్టంట్ మాస్టర్ జేజే పెర్రీ(JJ Perry) కొరియోగ్రఫీ చేయనున్నారు.







