Tovino Thomas: టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న మలయాళ నటుడు
ఎన్టీఆర్(NTR) ఓ వైపు వార్2(War2) సినిమాను రిలీజ్ కు రెడీ చేస్తూనే మరోవైపు ప్రశాంత్ నీల్(Prasanth Neel) తో కలిసి డ్రాగన్(Dragon) అనే సినిమా చేస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఎన్టీఆర్ చాలా బాగా మేకోవర్ అయ్యాడు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇతర భాషానటులు కూడా నటిస్తున్నారు. అందులో భాగంగానే ఈ సినిమాలో ఓ నటుడు టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తున్నారని తెలుస్తోంది.
అతను మరెవరో కాదు, మలయాళ నటుడు టోవినో థామస్(Tovino Thomas). ఈ సినిమాలో టోవినో థామస్ ఓ కీలక పాత్ర చేయనున్నాడని టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్ లో ఎక్కువగా టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే మలయాళ ఇండస్ట్రీ నుంచి పుష్ప(Pushpa) సినిమాతో ఫహాద్ ఫాజిల్(Fahaad Faazil) టాలీవుడ్ లోకి అడుగుపెట్టగా ఇప్పుడు టోవినో థామస్ అడుగుపెట్టనున్నట్టు తెలుస్తోంది.
గత కొన్ని సినిమాలుగా టోవినో థామస్ మార్కెట్ విపరీతంగా పెరిగింది. మార్కెట్ విపరీతంగా పెరిగినప్పటికీ అతను వేరే భాషల్లో నటించింది లేదు. అలాంటి టోవినో ఇప్పుడు మొదటిసారి ఎన్టీఆర్నీల్ ప్రాజెక్ట్ కోసం టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. మరి ఈ సినిమాలో టోవినో థామస్ ఏ పాత్రలో కనిపిస్తారో చూడాలి.







