వాయిదా దిశగా టాలీవుడ్ పాన్ ఇండియా సినిమాలు
ఈ ఏడాది టాలీవుడ్ నుంచి ఎక్కువ సంఖ్యలో స్టార్ట హీరోలకు సంబంధించిన పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వీటిలో దేవర, పుష్ప2, గేమ్ ఛేంజర్, కల్కి ఉన్నాయి. ప్రస్తుతం ఇవన్నీ షూటింగ్ దశలోనే ఉన్నాయి. అయితే వీటిలో గేమ్ ఛేంజర్ మినహా అన్ని సినిమాలు ఇప్పటికే రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశాయి.
కానీ ఆ రిలీజ్ డేట్స్ మారే అవకాశాలు చాలానే ఉన్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వస్తున్న సినిమా 85% షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ, సైఫ్ అలీ ఖాన్ నటించాల్సిన కీలక షెడ్యూల్ కొంత బ్యాలెన్స్ ఉండిపోయింది. సైఫ్ రీసెంట్ గా సర్జరీ చేయించుకుని రెస్ట్ లో ఉన్నాడు. దానికి తోడు వీఎఫ్ఎక్స్ కూడా పెండింగ్ ఉండటంతో ఏప్రిల్ 5న రిలీజ్ కావాల్సిన దేవర పోస్ట్ పోన్ కానున్నట్లు తెలుస్తోంది.
ఇక ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి2898AD. కల్కి వాస్తవానికి మొన్న సంక్రాంతికే రిలీజ్ కావాల్సింది కానీ షూటింగ్ లేటవడం వల్ల మే 9న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇటీవలే ప్రకటించారున. కానీ ఇప్పుడు ఆ డేట్ ను కూడా టీమ్ అందుకునే పరిస్థితిలో లేదట. సినిమాలో ఎక్కువ భాగం గ్రాఫిక్స్ తోనే కావడం వల్ల షూటింగ్ లేటవుతూ వస్తుందట. అందుకే కల్కి మరోసారి వాయిదా పడటం ఖాయంగా చెప్తున్నారు.
పుష్ప2 సినిమా కూడా వాయిదా పడనుందని వార్తలొస్తున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఆడియన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఆగస్ట్ 15న పుష్ప2ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. కానీ ఇంకా ఎక్కువ భాగం షూటింగ్ పెండింగ్ ఉండటం వల్ల ఈ సినిమా కూడా వాయిదా పడుతుందని వార్తలొస్తున్నాయి.
ఇక రామ్ చరణ్- శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ సినిమా ఇప్పటికే ఎన్నోసార్లు రిలీజ్ డేట్ ను అనుకుని మార్చుకుంటూ ఉన్నారు. ఈ సినిమాను సెప్టెంబర్ లో రిలీజ్ చేయనున్నట్లు దిల్ రాజు ఒక నెల ముందు చెప్పాడు. కానీ ఇప్పుడు గేమ్ ఛేంజర్ అక్టోబర్ కు షిప్ట్ కానుందని తెలుస్తోంది. మొత్తానికి టాలీవుడ్ నుంచి రానున్న నాలుగు పెద్ద పాన్ ఇండియా సినిమాలు వాయిదా పడనున్నట్లు సమాచారం. అదే జరిగితే ఈ ప్రభావం ఇతర సినిమాలపై గట్టిగా పడనుంది.













