Raja Saab: అమెరికా ప్రమోషన్స్ పై కన్నేసిన టాలీవుడ్
ప్రస్తుత రోజుల్లో తెలుగు సినిమా ప్రమోషన్లకు యూఎస్ఎ ప్రధాన కేంద్రంగా మారింది. డల్లాస్(Dallas), బే ఏరియా(Bay Area), న్యూ జెర్సీ(New Jersey) లాంటి నగరాల్లో తెలుగు ప్రజలు ఎక్కువగా నివసిస్తున్నందున, చిత్ర యూనిట్లు ఆ ప్రాంతాలను వెళ్లి అక్కడి ఆడియన్స్ తో ఇంటరాక్ట్ అవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. తెలుగు సినిమాలకు ఓవర్సీస్ కలెక్షన్లు కూడా కీలకంగా మారడంతో మేకర్స్ ప్రమోషన్స్ ను ఇలా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారు.
అయితే ఇప్పుడు టాలీవుడ్ లోని పలు సినిమాలు అమెరికాలో ప్రమోషన్స్ కు రెడీ అవడంతో ఇండియాలోని ఆడియన్స్ మేకర్స్ యూఎస్ లో ప్రమోషన్స్ ఎలా జరుగుతాయో చూడ్డానికి ఆసక్తిగా ఉన్నారు. కాగా ఆంధ్రా కింగ్ తాలూకా(andhra king thaluka) రిలీజ్ సందర్భంగా ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని(ram pothineni) ఈ నెల 26న అమెరికా వెళ్లి అక్కడి ఆడియన్స్ తో కలిసి సినిమా చూడబోతున్నారు.
రామ్(Ram) తర్వాత వెంటనే డిసెంబర్ 5న రిలీజ్ కానున్న అఖండ2(Akhanda2) ప్రమోషన్స్ కోసం బాలయ్య(Balayya) కూడా అమెరికా వెళ్లనున్నారు. డల్లాస్ మరియు బే ఏరియా రెండింటికీ బాలయ్య వెళ్లనున్నారని ఇన్ సైడ్ ఇన్ఫర్మేషన్. ఇక డిసెంబర్ ఆఖరి వారంలో రాజా సాబ్(raja saab) ప్రమోషన్స్ కోసం ప్రభాస్(prabhas) కూడా అమెరికా వెళ్లనున్నాడని ఎప్పట్నుంచో వార్తలొస్తున్న విషయం తెలిసిందే. ఏదేమైనా రానున్న 45 రోజుల్లో అమెరికాలో తెలుగు స్టార్ల సందడితో ఓవర్సీస్ ఆడియన్స్ పండగ చేసుకోవడం ఖాయం.






