కరోనాపై పోరుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అండగా నిలిచిన తెలుగు సినీ పరిశ్రమ
కరోనా వైరస్(కోవిడ్ 19) నిర్మూనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రతిపాదికన చర్యు చేపడుతున్నాయి. ఏ ఉపద్రవం వచ్చిన ప్రధానంగా ముందుకొచ్చేదే తెలుగు సినీ పరిశ్రమ, ఈ కరోనా మహమ్మారిని తరిమికొట్టడానికి బిగ్ స్టార్స్ ఇప్పటికే తమ వంతు సాయంగా విరాళాను ప్రకటించారు.
ప్రభాస్ రూ. 4 కోట్ల విరాళం
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ కరోనా నివారణ చర్య నిమిత్తం తెలుగు రాష్ట్రాలకు రూ. కోటి రూపాయు ప్రకటించారు. ఈ రూ. కోటి విరాళం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రు సహాయ నిధికి ఇవ్వనున్నట్లుగా ఆయన తెలియజేశారు. అలాగే ప్రధానమంత్రి సహాయనిధికి రూ. 3 కోట్లు ఇవ్వనున్నట్లుగా ఆయన ప్రకటించారు. తెలుగు సినీ కార్మికుల సహాయార్థం 50 లక్షల రూపాయల చెక్ ను కరోనా క్రైసిస్ ఛారిటీ (సి సి సి) అందచేశారు.
పవన్ కళ్యాణ్ రూ. 2 కోట్ల విరాళం
‘‘కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడే క్రమంలో ఏపీ, తెలంగాణ సీఎం సహాయ నిధుకు రూ.50 లక్షలు చొప్పున కోటి రూపాయ విరాళం అందిస్తాను. అలాగే భారత ప్రధాన మంత్రి సహాయ నిధికి కోటి రూపాయ విరాళం అందిస్తున్నాను’’ . ప్రధాని నరేంద్రమోదీ స్ఫూర్తివంతమైన నాయకత్వం కరోనా మహమ్మారి నుంచి దేశాన్ని కాపాడుతుందని పవన్ ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ రోజు 03.04.2020 ప్రధాని సహాయ నిధి కి కోటి రూపాయలు ట్రాన్స్ఫర్ చేసారు.
1 కోటి 25 లక్షల రూపాయల విరాళం ప్రకటించిన నటసింహ నందమూరి బాలకృష్ణ
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం అంతా స్తంభించిపోయింది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది.హిందూపూర్ శాసనసభ్యులు, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ చైర్మన్, నటసింహ నందమూరి బాలకృష్ణ 1 కోటి 25 లక్షల రూపాయలు విరాళంగా అందిస్తున్నట్టు ప్రకటించారు. అందులో 50 లక్షలు ఆంధ్రప్రదేశ్ సీఎం సహయనిధికి, 50 లక్షలు తెలంగాణ సీఎం సహాయనిధికి అందజేస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా ఎంతో ఇబ్బంది పడుతున్న తెలుగు సినీ కార్మికుల సహాయార్థం 25 లక్షల రూపాయల చెక్ ను కరోనా క్రైసిస్ ఛారిటీ (సి సి సి) ఎగ్జిక్యూటివ్ మెంబర్ సి కళ్యాణ్ కు అందించారు. కరోనా పై పోరాటానికి తన వంతు బాధ్యతగా 1 కోటి 25 లక్షల విరాళంగా అందిస్తున్నట్టు నందమూరి బాలకృష్ణ తెలిపారు.
మహేష్ రూ. కోటి విరాళం
‘‘కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వాు చక్కటి ప్రయత్నాు చేస్తున్నాయి. ఈ పోరాటంలో నా వంతు భాగస్వామ్యంగా తెంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి కలిపి రూ. కోటి రూపాయల్ని విరాళంగా ఇస్తున్నాను. బాధ్యతాయుతమైన పౌయిగా ప్రతి ఒక్కరూ లాక్‌డౌన్‌కు సహకరించి నియమ నిబంధనను పాటించండి. ఇంటిలోనే ఉండి.. సురక్షితంగా ఉండండి..’’ అని ట్వీట్లో తెలిపారు.తెలుగు సినీ కార్మికుల సహాయార్థం 25 లక్షల రూపాయల చెక్ ను కరోనా క్రైసిస్ ఛారిటీ (సి సి సి) అందచేశారు.
రూ. 75 లక్షలు ప్రకటించిన ఎన్టీఆర్
ఈ మొత్తంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరో రూ.25లక్షలు అంటే రెండు రాష్ట్రాకు రూ.50 లక్షల విరాళంతో పాటు మరో రూ.25 లక్షలు కరోనా వైరస్ ప్రభావంతో ఉపాధి కోల్పోయిన రోజూవారీ సినీ పేద కళాకారుకు కరోనా క్రైసిస్ ఛారిటీ (సి సి సి) అందచేశారు. అందజేస్తున్నట్లుగా ఎన్టీఆర్ ప్రకటించారు.
బాబాయ్ స్ఫూర్తితో నేను సైతం రామ్‌చరణ్
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ సంక్షోభ సమయంలో పవన్ కల్యాణ్ స్ఫూర్తితో తాను రూ. 70 లక్షలు విరాళం అందించనున్నట్టు మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ తెలిపాడు. కరోనా వైరస్‌పై పోరాటం చేస్తున్న కేంద్ర, తెలుగు రాష్ట్రా ప్రభుత్వాలకు తన వంతు సాయంగా ఈ మొత్తాన్ని అందజేయనున్నట్టు ప్రకటించారు.కరోనా వైరస్ ప్రభావంతో ఉపాధి కోల్పోయిన రోజూవారీ సినీ పేద కళాకారుకు కరోనా క్రైసిస్ ఛారిటీ (సి సి సి)కి ౩౦ లక్షలు అందచేశారు
అల్లు అర్జున్ విరాళం రూ.1.25 కోట్లు
కరోనాపై పోరాటానికి సంబంధించిన సహాయ కార్యక్రమాకు హీరో అల్లు అర్జున్ రూ. 1.25 కోట్ల విరాళం ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయనిధికి చెరో రూ.50లక్షలు సాయం అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. మయాళంలో అల్లు అర్జున్‌కి అభిమానులు ఎక్కువ. అందుకే కేరళకూ సాయం చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25 లక్షలు విరాళం ఇస్తానన్నారు.కరోనా వైరస్ ప్రభావంతో ఉపాధి కోల్పోయిన రోజూవారీ సినీ పేద కళాకారుకు కరోనా క్రైసిస్ ఛారిటీ (సి సి సి)కి 20 లక్షలు అందచేశారు
రూ. 20 లక్షలు ప్రకటించిన త్రివిక్రమ్ శ్రీనివాస్
కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తున్న రెండు తెలుగు రాష్ట్రా ప్రభుత్వాలకు సహాయపడేందుకు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ముందుకొచ్చారు. ఏపీ, తెంగాణ రాష్ట్రాల సీఎం సహాయ నిధులకు రూ.10 లక్షలు చొప్పున మొత్తం రూ.20 లక్షలు అందించనున్నారు. ‘‘కరోనాపై పోరాటానికి సహాయపడే క్రమంలో ఏపీ, తెంగాణ రాష్ట్రా సీఎం సహాయనిధుకు రూ.పది లక్షలు చొప్పున విరాళం అందించాని మా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్ణయం తీసుకున్నార’’ని వంశీ ట్వీట్ చేశారు.
దర్శకుడు కొరటాల శివ 10 లక్షలు విరాళం
ప్రముఖ దర్శకుడు కొరటా శివ ఒక్కో తెలుగు రాష్ట్రాలకి ఐదు లక్షలు వంతున రెండు తెలుగు రాష్ట్రాలకు పది లక్షలు రూపాయలు విరాళాన్ని ప్రకటించారు.
నితిన్ విరాళం 20 లక్షలు
‘‘కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశ రక్షణ నిమిత్తం నా వంతు సాయం చేయానుకుంటున్నాను. అని టాలీవుడ్ నుండి శ్రీ కారం చుట్టారు ఈ అంటువ్యాధిని ఎదుర్కోవడానికి అవసరమైన పరికరాల నిమిత్తం తెంగాణ రాష్ట్రానికి రూ. 10 లక్షలు , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ. 10 లక్షలు విరాళం అందచేశారు . అందరం కలిసి ఈ మహమ్మారిపై యుద్ధం చేద్దాం. ఇంటిపట్టునే ఉండి సురక్షితంగా ఉండండి’’ అని నితిన్ తెలిపారు.
సాయితేజ్ రూ. 10 లక్షలు విరాళం
‘‘మనం ఇది వరకు మనం చూడనటువంటి శత్రువుతో యుద్ధం చేస్తున్నాం. దాని కోసం మనం అందరం కలిసే ఉన్నాం. అలాగే మనం ఆ యుద్ధంలో విజయం సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల సహాయ నిధికి నా వంతుగా రూ.10 లక్షలు విరాళాన్ని అందిస్తున్నాను.. ఇంట్లోనే ఉండండి.. జాగ్రత్తగా ఉండండి’’ అని సాయితేజ్ అదనంగా కరోనా వైరస్ ప్రభావంతో ఉపాధి కోల్పోయిన రోజూవారీ సినీ పేద కళాకారుకు కరోనా క్రైసిస్ ఛారిటీ (సి సి సి)కి 10 లక్షలు అందచేశారు
అనిల్ రావిపూడి రూ. 10 లక్షలు విరాళం
డైరెక్టర్ అనిల్ రావిపూడి కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి రెండు తెలుగు రాష్ట్రాలకు తన వంతుగా మొత్తం రూ. 10 లక్షలు విరాళం ప్రకటించారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధులకు చెరో రూ. 5 లక్షలు అందజేస్తున్నట్లు చెప్పారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజందరూ సామాజిక దూరం పాటిస్తూ, ఇళ్లల్లో ఉండి లాక్డౌన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాని కోరారు.
సుకుమార్ సైతం
కరోనాపై పోరుకు నేను సైతం అంటూ సుకుమార్ కూడా ఈ జాబితాలో చేరారు. రెండు తెలుగు రాష్ట్రా ప్రభుత్వాకు ఆయన రూ. 10క్ష సహాయం ప్రకటించారు.అదనంగా తన సొంత వూరికి 5 లక్షలు ఇచ్చారు.
నిర్మాతల సహాయం:
ఒక్కో తెలుగు రాష్ట్రానికి రూ.10 లక్షలు నిర్మాతలు దిల్ రాజు, శిరీష్
ప్రముఖ నిర్మాత దిల్ రాజుకి చెందిన నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ రెండు తెలుగు రాష్ట్రాలకూ విరాళం ప్రకటించింది. ఒక్కో రాష్ట్రానికి రూ.10 లక్షలు చొప్పున దిల్ రాజు విరాళం ప్రకటించారు. కరోనా వైరస్ ప్రభావంతో ఉపాధి కోల్పోయిన రోజూవారీ సినీ పేద కళాకారుకు కరోనా క్రైసిస్ ఛారిటీ (సి సి సి)కి 10 లక్షలు అందచేశారు కరోనాపై నివారణ చర్యకు వైజయంతి మూవీస్ అధినేత సి. ఆశ్వనీదత్ సైతం రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో రూ.10 లక్షలు సాయం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి చెరో రూ.10 లక్షలు విరాళం ఇవ్వనున్నట్లు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత సూర్యదేవర రాధా కృష్ణ (చినబాబు) ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్ అధినేతు నవీన్ ఎర్నేని, రవిశంకర్ కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో రూ.10 లక్షలు సాయం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి లక్ష రూపాయాలు ఇవ్వనున్నట్లు ‘3జీ ల వ్’ నిర్మాత ప్రతాప్ కొగట్ల ప్రకటించారు.
వి.వి.వినాయక్ 5 లక్షలు విరాళం:
వివి. వినాయక్ 5 లక్షలు ప్రకటించారు. కాగా జీవిత, రాజశేఖర్ 200 బ్యాగ్ నిత్యవసర వస్తువును అందచేశారు. హైదరాబాద్‌లోనూ, చెన్నైలోనూ ఉన్న సంగీతకారుకు సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ రూ.5 లక్షలు విరాళం ప్రకటించారు. అలాగే సుధీర్ బాబు రెండు లక్షలు రూపాయ విరాళాన్ని ప్రకటించారు. ప్రసాద్ గౌడ్, శివాజీ రాజా వంటి వారు వారి వంతు సాయం అందించి ఉదాత్తత చాటుకున్నారు.
అ్లరి నరేష్ 50 వేకు పైగా విరాళం
‘‘కోవిడ్ 19 నివారణ కోసం జరిగే ఈ 21 రోజు లాక్ డౌన్ వ్ల మా ‘నాంది’ యూనిట్లో రోజూవారి వేతనంతో జీవనం సాగించే 50 మందికి పైగా ఉన్న మా కార్మికు ఆర్థిక ఇబ్బందు పడకుండా ఉండాని, మా యూనిట్ తరుపున నేను.. మా నిర్మాత సతీష్ వేగేశ్నగారు కలిసి, ప్రతి ఒక్కరికి తలా 10 వే రూపాయు సాయం అందించాని నిర్ణయించుకున్నాం. ఇది గుర్తింపుకోసం చేస్తున్న ప్రయత్నం కాదు.. సాటి మనిషికి సాయం చెయ్యడం మన కర్తవ్యం. ఈ సాయం కావాలి.. మరిన్ని సాయాకు ‘నాంది’’’ అని తెలిపారు.
శభాష్ ప్రణీత
ఎంత సహాయం ఇచ్చామన్నది కాదు… ఎంతమందిలో స్ఫూర్తి కలిగించేలా ముందుకొచ్చామన్నదీ ముఖ్యమే. ఒక విధంగా కథానాయికల్లో స్ఫూర్తి కలిగించేలా ప్రణీతా సుభాష్ తనవంతుగా లక్ష రూపాయలు విరాళం ప్రకటించారు.













