హిట్ అయితే కలెక్షన్ల వర్షం ఖాయమే!
విశ్వక్సేన్ నటిస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాపైనే ప్రస్తుతం అందరి కళ్లూ ఉన్నాయి. మరో మూడు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అదో రోజు గంగం గణేశా, భజే వాయువేగం రిలీజవుతున్నప్పటికీ ఈ సినిమాపైనే అందరికీ భారీ అంచనాలున్నాయి. సరైన సినిమా లేక థియేటర్లు బోసిపోతున్న టైమ్ లో మళ్లీ బాక్సాఫీస్ కు ఊపు తెచ్చే సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరినే అని అందరూ నమ్ముతున్నారు.
రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ తో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. రంగస్థలం సినిమా తర్వాత అంత డెప్త్ ఉన్న విలేజ్ డ్రామాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనిపిస్తుందని అందరూ అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా కోసం యువన్ శంకర్ రాజా కంపోజ్ చేసిన రెండు సాంగ్స్ ఆడియన్స్ కి బాగా రీచ్ అయ్యాయి. ఊరమాస్ లీడర్ గా విశ్వక్ కూడా బాగా సెట్ అయ్యాడు.
దానికి తోడు గత ఆరు నెలలుగా టాలీవుడ్ లో విలేజ్ బ్యాక్ డ్రాప్ పొలిటికల్ డ్రామా రాకపోవడం కూడా ఈ సినిమాకు కలిసొచ్చే అంశమే. సినిమాలో కంటెంట్ బాగుండి, ఆడియన్స్ సినిమాకు కనెక్ట్ అవగలిగితే కలెక్షన్ల వర్షం కురవడం ఖాయం. అదే రోజు రెండు సినిమాలు రిలీజవుతున్నప్పటికీ వాటి జానర్లు వేరు కాబట్టి ఆ సినిమాలకు హిట్ టాక్ వచ్చినా దేని ఆడియన్స్ దానికి ఉంటారు. కాబట్టి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి కావాల్సిందల్లా కంటెంట్ బాగుండటం మాత్రమే. ఈ సినిమాలో విశ్వక్ కు జోడీగా నేహా శెట్టి నటించగా, అంజలి కీలక పాత్రలో నటించింది.













