రామ్- త్రివిక్రమ్ సినిమా ఉన్నట్టా? లేనట్టా?
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం మహేష్ బాబు తో గుంటూరు కారం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తి కాకుండానే గురూజీ, తన తర్వాతి సినిమాను అల్లు అర్జున్తో అనౌన్స్ చేశాడు. బన్నీ, త్రివిక్రమ్ కాంబోలో రానున్న ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి. దానికి తోడు త్రివిక్రమ్ ఈసారి కాస్త గట్టిగా ప్లాన్ చేశాడని వార్తలు వినిపిస్తున్నాయి.
బన్నీతో సినిమా విషయాన్ని కాసేపు పక్కన పెడితే త్రివిక్రమ్ ఎప్పుడో ఏళ్ల కింద కమిట్ అయిన మూవీని మాత్రం ఇంకా స్టార్ట్ చేయట్లేదంటూ గురూజీని విమర్శిస్తున్నారు. తన కెరీర్ స్టార్టింగ్ లో స్రవంతి మూవీస్ బ్యానర్ లో మంచి ఆఫర్లు అందుకుని స్టార్ డైరెక్టర్ గా మారిన త్రివిక్రమ్ ఆ రుణాన్ని తీర్చుకునే పనిలో భాగంగా ఆ ఫ్యామిలీకి చెందిన రామ్ తో ఓ సినిమాను చేయాలని ప్లాన్ చేసుకున్నట్లు అప్పట్లో వార్తలొచ్చాయి.
గుంటూరు కారం తర్వాత త్రివిక్రమ్ రామ్ తోనే సెట్స్ పైకి వెళ్తాడేమో అనుకుంటే బన్నీతో సినిమాను అనౌన్స్ చేశాడు. దీంతో రామ్ ఫ్యాన్స్ త్రివిక్రమ్ పై గుస్సా అవుతున్నారు. అసలు వారిద్దరి కాంబినేషన్ లో సినిమా ఉంటుందా లేదా అని కొందరంటుంటే, ఇంత పెద్ద డైరెక్టర్ అయ్యాక రామ్ లాంటి మధ్య తరహా హీరోతో త్రివిక్రమ్ సినిమా ఎందుకు చేస్తాడని మరికొందరంటున్నారు.













