Jaya Krishna: ఘట్టమనేని వారసుడి కోసం మూడు బడా నిర్మాణ సంస్థలు

కృష్ణ(Krishna) కొడుకు రమేష్ బాబు(Ramesh Babu) వారసుడు జయ కృష్ణ(Jaya Krishna) త్వరలోనే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అంటే ఘట్టమనేని వారసత్వం నుంచి మూడో జెనరేషన్ ఇండస్ట్రీలోకి రాబోతుంది. జయ కృష్ణను హీరోగా లాంచ్ చేసే బాధ్యతల్ని డైరెక్టర్ అజయ్ భూపతి(Ajay Bhupathi) తీసుకోగా, జయకృష్ణ గత కొన్నేళ్లుగా నటన సహా మిగిలిన అన్ని క్రాఫ్ట్స్ లోనూ ట్రైనింగ్ తీసుకున్నాడు.
ఆల్రెడీ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్స్ పనులు ఎంతో వేగంగా జరుగుతున్నాయి. మేకర్స్ సెప్టెంబర్ నుంచి షూటింగ్ ను షురూ చేయాలని చూస్తున్నారు. అందులో భాగంగా జయ కృష్ణ పక్కన ఓ తెలుగమ్మాయి కోసం టీమ్ వేట కొనసాగిస్తోంది. కాగా ఈ సినిమాను తెలుగు చిత్ర పరిశ్రమలోని మూడు పెద్ద బ్యానర్లు కలిసి నిర్మించనున్నట్టు తెలుస్తోంది.
వైజయంతీ మూవీస్(Vyjayanthi Movies), పద్మాలయ స్టూడియోస్(Padmalaya Studios), ఆనంది ఆర్ట్ట్స్(Anandi Arts) కలిసి జయ కృష్ణ ను పరిచయం చేయనున్నాయట. ఈ సినిమాను అజయ్ భూపతి ఫుల్ లెంగ్త్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించనుండగా జివి ప్రకాష్(GV PRakash) ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. ఆగస్టులో ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టి సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టేలా సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.