Anirudh: అనిరుధ్ కు ఇదే మంచి ఛాన్స్

సూపర్ స్టార్ రజినీకాంత్(rajinikanth) చేస్తున్న తాజా సినిమా కూలీ(coolie). లోకేష్ కనగరాజ్(lokesh kanagaraj) దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ను జరుపుకుంటుంది. కూలీ సినిమా ఆగస్ట్ 14న రిలీజ్ కానుండగా ఈ సినిమాకు సౌత్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్(anirudh ravichander) సంగీతం అందిస్తున్నాడనే విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం కూలీ ఫస్ట్ సింగిల్ ఈ వారం రిలీజ్ కాబోతున్నట్టు తెలుస్తోంది.
కానీ అనిరుధ్ నుంచి వచ్చిన గత రెండు సినిమాలు వేట్టయాన్(Vettayan), విదాముయార్చి(vidamuyarchi) అంచనాలను అందుకోలేకపోయాయిన టాక్ బాగా వినిపించింది. ఈ రెండు సినిమాలకు అనిరుధ్ ఇచ్చిన సాంగ్స్, బీజీఎం పై విమర్శలతో పాటూ అనిరుధ్ మ్యూజిక్ అవుట్‌డేటెడ్ అవుతుందనే కామెంట్స్ కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూలీ నుంచి రాబోతున్న ఫస్ట్ సాంగ్ అనిరుధ్ కు కీలకం కానుంది.
ఫస్ట్ సాంగ్ తో పాటూ కూలీ సినిమాకు మంచి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చి అనిరుధ్ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా చెప్పాలంటే అనిరుధ్ కు కూలీ రూపంలో మంచి ఛాన్స్ దక్కింది. కూలీ సినిమాకు కేవలం కోలీవుడ్ లోనే కాకుండా దేశ వ్యాప్తంగా మంచి బజ్ ఉంది. ఈ సినిమాకు మంచి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తే ఆటోమేటిక్ గా అనిరుధ్ గురించి మళ్లీ అందరూ గొప్పగా చెప్పుకునే అవకాశముంటుంది. మొత్తానికి కూలీ సినిమా అనిరుధ్ కు లైఫ్ లైన్ గా మారింది.