Spirit: ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు

రెబల్ స్టార్ ప్రభాస్(prabhas) ప్రస్తుతం ది రాజా సాబ్(the Raja saab), ఫౌజీ(Fauji) సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ రెండింటిలో రాజా సాబ్ దాదాపుగా పూర్తవగా, ఫౌజీ మూవీ షూటింగ్ కూడా 40% పూర్తైనట్టు తెలుస్తోంది. వీటితో పాటూ ప్రభాస్ లైనప్ లో మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులుండడం తెలిసిందే. ప్రధానంగా యానిమల్(Animal) సినిమా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) దర్శకత్వంలో రానున్న స్పిరిట్(Spirit) పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. యానిమల్ తర్వాత నుంచి సందీప్ స్పిరిట్ పైనే వర్క్ చేస్తున్నారు.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లో ఉన్న స్పిరిట్ నుంచి ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తుందా అని ఫ్యాన్స్ తో ఎదురు చూస్తున్నారు. తాజాగా ఒక అనధికారిక X అకౌంట్ నుంచి సెప్టెంబర్ 2న స్పిరిట్ షూటింగ్ ప్రారంభ వేడుక ఘనంగా జరగనుందని వివరిస్తూ వేసిన పోస్ట్ క్షణాల్లో సోషల్ మీడియాలో వైరలైంది. ఆ పోస్ట్ చూసి చాలా మంది అభిమానులు అది నిజమే అనుకొని సంతోషిస్తున్నారు. అయితే, ఆ పోస్ట్ లో ఏ మాత్రం నిజం లేదని తెలుస్తోంది. స్పిరిట్ గురించి ఏదైనా అప్డేట్ ఉంటే అది సందీప్ రెడ్డి వంగా నుంచి కానీ సినిమా నిర్మాణ సంస్థ నుంచి మాత్రమే వస్తాయని, ఇలాంటి అసత్యాలను నమ్మొద్దని పీఆర్ టీమ్ గతంలోనే వివరణ ఇవ్వడం తెలిసిందే.
మొదటి నుంచి అనధికారిక సోషల్ మీడియా అకౌంట్ నుంచి వచ్చే లీక్‌లు, అసత్యాలను నమ్మొద్దని విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ కొందరు మాత్రం ఆ పోస్టులను గుడ్డిగా నమ్మేస్తున్నారు. టీ- సిరీస్(T Series), భద్రకాళి పిక్చర్స్(Badrakali Pictures) నిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ హై ఓల్టేజ్ యాక్షన్ సినిమాలో యానిమల్ ఫేమ్ త్రిప్తి డిమ్రీ(Tripti Dimri) హీరోయిన్ గా నటిస్తుండగా హర్షవర్థన్ రామేశ్వర్(Harsha vardhan rameswar) ఈ మూవీకు సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే స్పిరిట్ నుంచి అధికారిక అప్డేట్ రానుందని తెలుస్తోంది.