Balakrishna: బాలయ్యను ఓ ఆటాడుకున్న అక్కాచెల్లెళ్లు
వరుస సక్సెస్ లతో జోష్ మీదున్న నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna)కు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. దీంతో ఇండస్ట్రీ మొత్తం బాలయ్యకు శుభాకాంక్షలు చెప్పగా, బాలయ్య చెల్లెలు నందమూరి భువనేశ్వరి(Nara Bhuvaneswari) ఓ గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేసింది. ఈ పార్టీలో నందమూరి, నారా కుటుంబాలకు సంబంధించన వారంతా హాజరయ్యారు.
ఈ వేడుకలో బాలయ్యను ఆయన అక్కాచెల్లెళ్లు సరదాగా ఆట పట్టించారు. చిన్నతనం నుంచి బాలయ్య చేసిన అల్లరి, వసుంధర(Vasundhara)తో ప్రేమ, పెళ్లితో పాటూ ఆయన కాలేజ్ లవ్ స్టోరీని కూడా చెప్పించారు. సినిమాల్లో నటించిందుకు నీకు పద్మభూషణ్ ఇచ్చారా లేక వసుతో డిప్లమేటిక్ గా 40 ఏళ్ల నుంచి నటించినందుకా అని పురంధేశ్వరి(Purandheswari) బాలయ్యను అడిగ్గా, దానికి బాలయ్య(Balayya) వసు(Vasu) తన అదృష్టమని, ఆ అదృష్టం వల్లే తనకు ఈ అవార్డ్ వచ్చిందని చెప్పాడు.
బాలా అన్న నీ ఫస్ట్ క్రష్ ఎవరు? కాలేజ్ లో నువ్వు ఎవరి వెంట పడలేదా అని భువనేశ్వరి అడిగ్గా, నేను అందరినీ చూసేవాడినని, అందరూ తనకు అందంగానే కనిపిస్తారని, కానీ తానవరి వెంటా పడలేదని, తన వెనుకే ఓ అమ్మాయి పడిందని, ఆ కథ ఇప్పుడొద్దులే అని బాలయ్య అన్నాడు. అదే సంభాషణలో భాగంగా బాలయ్య తన భార్య వసుంధరకు ఒక చిన్న లవ్ నోట్ రాశాడని, ఆ నోట్ ను ఆమె ఇప్పటికీ చాలా భద్రంగా దాచుకున్నట్టు తెలిపింది.













