The Raja Saab: రాజా సాబ్ నుంచి ఎగ్జైటింగ్ అప్డేట్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas) ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. రెండు సినిమాలను చేస్తున్న ఆయన లైనప్ లో తర్వాత కూడా భారీ ప్రాజెక్టులున్నాయి. అయితే వాటిలో ముందుగా ప్రభాస్ నుంచి రానున్న సినిమా ది రాజాసాబ్(the raja saab). మారుతి(Maruthi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి.
ప్రభాస్ కెరీర్లో మొదటిసారి హార్రర్ కామెడీ థ్రిల్లర్ జానర్ లో సినిమా రానుండగా, ఆల్రెడీ ఈ మూవీ నుంచి వచ్చిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ కు ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ రావడంతో మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. దీంతో రాజా సాబ్ నుంచి ట్రైలర్ ఎప్పుడెప్పుడొస్తుందా అని ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. కాగా ఇప్పుడు మేకర్స్ రాజా సాబ్ ట్రైలర్ అప్డేట్ ను అందించారు.
సెప్టెంబర్ 29వ తేదీ సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేయనున్నట్టు అనౌన్స్ చేస్తూ మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. 29వ తేదీన దసరా కానుకగా ట్రైలర్ ను రిలీజ్ చేసి, ఆ తర్వాత దాన్ని కాంతార చాప్టర్1(kanthara chapter1) సినిమాతో ఎటాచ్ చేసి పాన్ ఇండియా స్థాయిలో సినిమాపై హైప్ పెంచాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 9న రిలీజ్ కానుందని సమాచారం.